రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మరోసారి తన నోటి దూలతో మహిళల నుండి తీవ్ర స్థాయిలో నిరసన ఎదుర్కొన్నారు. బుచ్చయ్య చౌదరి తన నియోజకవర్గ పరిధిలో 27వ డివిజన్లో ప్రచారానికి చేరుకున్న సందర్భంలో అక్కడ వున్న మహిళలు టీడీపీ అధికారంలో తమకేమి మేలు జరగలేదని మీకెందుకు ఓట్లు వేయాలంటూ నిలదీశారు . దీనితో ఆగ్రహించిన బుచ్చయ్య వారిని మీ అంతూ చూస్తాను చెప్పుతో కొడతాను అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . అంతే కాకుండా వారి మీదకు కొట్టాడానికి దూసుకుపోయారు . వెంటనే మహిళలు అందరూ అతన్ని అడ్డుకొని ప్రశ్నిస్తే తిట్టడం ఏమిటి, పైగా చెప్పుతో కొడతా అంటారా అని తిరగబడి వెంట పడ్డారు . దీనితో పక్కనున్న టీడీపీ కార్యకర్తలు జాగ్రత్త పడి బుచ్చయ్య చౌదరినీ అక్కడినుండి తీసుకువెళ్ళిపోయారు.
దీని మీద ఆగ్రహించిన మహిళలు జరిగిన సంఘటన మీద లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. బుచ్చయ్య చౌదరికి మొదటి నుండి మహిళల మీద చిన్న చూపు గతంలో కూడా ఇళ్ల పట్టాల పంపిణీ దగ్గర మహిళలను బూతులు తిట్టి, చీర లాగి, జుట్టుపట్టుకొని కొట్టారు , . అప్పుడు నియోజకవర్గం అంతా పెద్ద ఎత్తున గొడవలు జరిగితే చివరకు ప్రజల ఆందోళనకు దిగివచ్చి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు కనీసం మహిళలకు క్షమాపణ చెప్పలేదు అంటూ వారు నియోజకవర్గ ఆందోళనకు పిలుపును ఇచ్చారు.
అంతే కాకుండా మా సమస్యల మీద మాకు సమాధానం చెప్పకపోతే చెప్పకపొయ్యారు తిరిగి మీరు వైసీపీకి చెందిన వారు అంటూ భూతులు తిట్టడం ఎంత వరకు సమంజసం, బుచ్చయ్య చౌదరి కి ఏడు పదుల వయస్సు వచ్చింది గానీ బుద్ది మాత్రం పెరగలేదు. ప్రజలతో ముఖ్యంగా మహిళలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదు అంటూ తమ నిరసనలను వ్యక్తం చేస్తూ బుచ్చయ్య చౌదరినీ, టీడీపీ వారిని తమ ప్రాంతంలోకి అడుగు పెట్టనీయ్యమని తెగేసి చెబుతున్నారు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి దెబ్బకు రాజమండ్రి సిటీ, రూరల్ లో టీడీపీ నాయకులు వణుకుతున్నారు. బుచ్చయ్య నోటి దురుసు ఎక్కడి వరకు వెళ్తుందో కనీసం వారికి క్షమాపణ చెప్పిన బాగుంటది అని అనుకుంటున్నారు.