తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీని అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సర్కారుకు ఇది గుడిబండలా మారిందని పీసీసీ పెద్దలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట.
అక్కడ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి.. కర్ణాటకను స్ఫూర్తిగా తీసుకుని ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. అందులో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకం పేరుతో హడావుడి చేశారు. తీరా చూస్తే ప్రజలను మోసం చేశారు. కేవలం ప్రభుత్వం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, పెంచాలని మహిళలు డిమాండ్ చేసినా పట్టించుకోవడంలేదు. కొన్ని రూట్లలోనే తిప్పుతున్నారు. ఆ రూట్లలో తమకు గిరాకీ తగ్గిందని ఆటోవాలాలు గగ్గోలు పెడుతున్నారు. పలువురు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆర్టీసీ కూడా బాగా నష్టాల్లోకి కూరుకుపోయింది. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి ఉంది.
ముఖ్యంగా సిటీలో రాపిడో, ఓలా సంస్థలు నష్టాలను చవి చూస్తున్నాయి. దీంతో వీరు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి మంగళం పాడేందుకు రేవంత్ ప్రభుత్వం కారణం కోసం అన్వేషిస్తోందంట. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరుతో కాంగ్రెస్ పథకాలను ఇక్కడ ప్రకటించారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. మోసగాడిగా పేరున్న బాబు దీని అమలు గురించి మాత్రం చెప్పలేదు. ఓట్లు దండుకునేందుకు ఉచిత ప్రయాణమని చెప్పేశాడు. అది రాష్ట్ర స్థాయిలోనా.. లేదా జిల్లా స్థాయిలోనా.. లేదా నియోజకవర్గ స్థాయిలోనా అనేది చెప్పలేదు. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని భావించి ఓట్లు వేసేస్తారని నారా వారి ఆలోచన. కానీ ఇది మోసం చేయడం కిందకే వస్తుంది. ఒకవేళ కూటమి పవర్లోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ నడుస్తున్న బాటలోనే టీడీపీ నడిచే అవకాశముంది.
బస్సు ప్రయాణం విషయంలో కూటమి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయలేక.. ఎప్పుడెప్పుడు తీసేద్దామని ఆలోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు కొన్ని రోజులు హడావుడి చేసి ఆ తర్వాత తీసేయడమో లేక.. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టడమే చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని జనంలో అభిప్రాయాలున్నాయి. ఆయన గత చరిత్ర అదే చెబుతోంది. ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఎల్లో జర్నలిస్టు అన్ని హామీలను బాబు నెరవేర్చలేరనే ధోరణలో మాట్లాడారు. ఎన్నికలు కాకముందే బాబు అండ్ కో చేతులెత్తేసింది. మిగిలిన హామీల విషయంలోనూ అంతే కదా..