విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, కేశినేని చిన్ని పోటీ పడుతున్నారు. కాగా సోదరుల మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంపీ కేశినేని నాని కేశినేని చిన్నిపై విరుచుకుపడ్డారు. క్రిమినల్ అయిన కేశినేని చిన్నికి టీడీపీ ఎంపీగా సీటు ఇచ్చింది. ఇలాంటి వ్యక్తులు గెలిస్తే బెజవాడ ఫర్ సేల్ అనే బోర్డు పెడతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు కేశినేని నాని.
చిన్నీ రియల్ ఎస్టేట్ దందాల కోసం తన వందల స్టిక్కర్లు కార్లకు వేసి వాడాడని, ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేసానని అపర కుబేరుడని చెప్పుకునే చిన్ని ఇలా మోసాలు చేయటం ఏంటని ఎంపీ నాని ప్రశ్నించారు. గత 25 సంవత్సరాల నుండి తాను చిన్నీ విడిపోయామని,అనేకసార్లు అప్పులు పాలయ్యాను అంటూ చిన్ని మోసం చేశాడని, పిల్లల స్కూల్ ఫీజు, అద్దె కట్టడానికి డబ్బు లేదని చెబితే నేనే ఒక రూమ్ ఇచ్చానని కానీ నూజివీడులో భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తే నేను మా ఆఫీసుకు రావద్దని, నా పేరు చెడగొట్టవద్దని ఆఫీసు నుంచి పంపించానని ఎంపీ నాని వెల్లడించారు.
కేశినేని చిన్ని చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడని తెలంగాణలో కేశినేని డెవలపర్ల పేరుతో మోసం చేశాడని ప్రీ లాంఛ్ ఆఫర్లు పేరుతో పేదల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలు చేసినట్టు తెలంగాణ రేరా గుర్తించిందని కానీ ఇప్పటివరకు ఒక్క భవనం కూడా నిర్మాణం చేయలేదని ఎంపీ నాని వెల్లడించారు. చిన్నీ ఎన్నికల అఫిడవిట్ చూస్తే 2020 వరకు రూపాయి ఆదాయం లేదని తెలిసిందని 2002 నుంచి ఇప్పటి వరకు ఆదాయపు పన్ను బకాయి ఉందని రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాక ఆదాయపు పన్ను కడుతున్నాడని నాని దుయ్యబట్టారు. వెయ్యి పేజీలతో డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో చిన్ని చిట్టా నేను చెబుతున్నానని కేశినేని చిన్ని లాంటి వ్యక్తులు ఎంపీ లేదా ఎమ్మెల్యే అయితే సమాజం పరిస్థితి ఏంటి ? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.