రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా ఏ ప్రాంతానికి చెందిన వారైనా సొంత నియోజక వర్గానికి కొంత అధికంగా కేటాయింపులు చేయడం, నియోజక వర్గాన్ని మిగతా నియోజక వర్గాల కన్నా అధికంగా అభివృద్ధి చేసుకోవడం సహజం. ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కన్నా ఎంతో ముందున్నారు ఏపీ సీఎం జగన్ .
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కుప్పం నియోజక వర్గానికి ఏమి చేసాడంటే వేలెత్తి చూపించడానికి సరైన అభివృద్ధి ఒక్కటి కూడా కనపడకపోవటం దురదృష్టకరం. ఆ కుప్పానికి కృష్ణా నీళ్లిచ్చి, కుప్పాన్ని మున్సిపాలిటీ చేసి, కుప్పంలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడంతో పాటు, గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధి అంటే ఇదీ అని చేసి చూపిన జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకి ఏమి చేసాడో, నియోజక వర్గాన్ని ఏ మేరకు అభివృద్ధి పధంలో నిలిపాడో చూద్దామా.
పులివెందులకు రెవెన్యూ డివిజన్ కార్యాలయం, నూతన పంచాయతీ రాజ్ డివిజన్ ఏర్పాటు,
ప్రతి గ్రామంలో సచివాలయాలు, rbk లు, విలేజ్ హెల్త్ క్లినిక్ ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ.
742 కోట్లతో నియోజకవర్గంలో నూతన సిమెంట్ రోడ్లు, బి.టి. రోడ్ల నిర్మాణం.
51 కోట్లతో రైతల వ్యవసాయ భూములకు రోడ్లు.
8.80 కోట్లతో రాయలాపురం బ్రిడ్జి నిర్మాణం
40 కోట్లతో ఆధునాతన ఆర్టీసి బస్టాండ్ నిర్మాణం
38.15 కోట్లతో మినీ సెక్రటేరియట్ నిర్మాణం
26.12 కోట్లతో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణం
20 కోట్లతో జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణం
32.8 కోట్లతో అధునాతనమైన నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్మాణం
26.1 కోట్లతో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన గుండి ఆలయ పునఃనిర్మాణము
79. 10 కోట్లతో 127 ఆలయాల నిర్మాణం/పునరుద్ధరణ.
12.6 కోట్ల టిటిడి నిధులతో నూతన కళ్యాణమండపముల నిర్మాణం మరియు పునరుద్ధరణ పనులు.
38 కోట్లతో ఇడుపులపాయలో వైఎస్సార్ మెమోరియల్ పార్కు ఏర్పాటు
39 కోట్లతో పులివెందుల పట్టణంలో గరండాల రివర్ ఫ్రంట్ అభివృద్ధి సుందరీకరణ.
65.99 కోట్లతో ఉల్లిమెల్ల చెరువు సుందరీకరణ, పార్కు అభివృద్ధి
14 కోట్లతో పులివెందుల శిల్పారామంలో అభివృద్ధి.
5.80 కోట్లతో చిత్రావతి జలాశయం వద్ద టూరిజం సౌకర్యాల అభివృద్ధి.
21.6 కోట్ల పడా నిధులతో చర్చిలు, మసీదులు, షాదిఖానా ల నిర్మాణం, 40 కోట్లతో పులివెందుల రింగ్ రోడ్డు ఆధునీకరణ, జంక్షన్ల
అభివృద్ధి . 50 కోట్ల రూపాయలతో పులివెందుల ప్రధాన రహదారుల విస్తరణ మరియు సుందరీకరణ.
· 87.50 కోట్లతో మల్టీప్లెక్స్ నిర్మాణం
17.03 కోట్లతో మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం
140.92 కోట్లతో జగనన్న మెగా హౌసింగ్ లే అవుట్ నందు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
పులివెందులను చెత్త రహిత పట్టణముగా అభివృద్ధి చేయడంలో భాగంగా 25.43 కోట్లతో ఆటోలు కొనుగోలు, జి.టి. ఎస్ ఏర్పాటు,
14.50 కోట్లతో ఆదర్శ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనముల నిర్మాణం
5.04 కోట్ల రూపాయలతో సెంట్రల్ బోటీవార్డ్, అధునాతన మార్కెట్ల అభివృద్ధి.
10.82 కోట్లతో అధునాతన వసతులతో హిందూ, ముస్లిం, క్రైస్తవ స్మశానవాటికల అభివృద్ధి
అధునాతన వసతులతో కూడిన బాలుర బాలికల జూనియర్ కళాశాలల ఏర్పాటు.
JNTU ఇంజినీరింగ్ కళాశాలలో లెక్టరర్ హాల్ కాంప్లెక్స్, ఇన్నోవేషన్ సెంటర్ నిర్మాణం
11 కోట్ల రూపాయలతో పులివెందుల ఏరియా హాస్పిటల్ ఆధునికరణ పనులు.
3.25 కోట్ల రూపాయలతో నూతన మునిసిపాలిటీ కార్యాలయం నిర్మాణం
100 కోట్లతో పులివెందుల మునిసిపాలిటిలో విలీనమైన గ్రామలలో యు.జి.డి. పనులు.
63 కోట్ల పాడా నిధులతో సి.సి. రోడ్ల నిర్మాణం.
65 కోట్లతో పులివెందుల పట్టణ సమగ్ర నీటి సరఫరా పనులు.
4.54 కోట్లతో కృష్ణ మందిరం ఏర్పాటు.
16.18 కోట్లతో పులివెందుల రాణి తోపు ఏర్పాటు.