ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఇంకో 10 రోజుల్లో జరగనున్నాయి. దీంతో వివిధ పార్టీలన్నీ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేతికి మైక్ చిక్కడం ఆలస్యం అధికార పార్టీ ఎమ్మెల్యేలపై, ముఖ్యమంత్రి జగన్ పై ముఖ్యమంత్రా, వాడెమ్మ మొగుడా, చెప్పుతో కొడతా, చొక్కా పట్టుకు ఈడుస్తా, అధః పాతాళానికి తొక్కేస్తా, బంగాళాఖాతంలో కలిపేస్తా అంటూ నోటికి ఏం మాటలు వస్తున్నాయో తెలియని విధంగా ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగాలు ఇస్తున్నాడు.
కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు సినిమా డైలాగులతో ప్రచారం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తీరు పట్ల సామాన్యులు సైతం అవాక్కవుతున్నారు. సాధారణ స్థితిలో ఉన్నాడా లేక మత్తులో ఉన్మత్తంగా మాట్లాడుతున్నాడా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నానాటికి దిగజారిపోతూ సంస్కారహీనమైన ప్రసంగాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక జనసేన శ్రేణులు జుట్టు పీక్కుంటున్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ ఏనాడూ సరైన రీతిలో నిర్మాణాత్మక విమర్శలు చేసినట్లు ఎక్కడా కనబడదు. ముఖ్యమంత్రి జగన్ పై అక్కసుతో రగిలిపోతూ ఆయనపై ద్వేషాన్ని ఒళ్ళంతా పూసుకున్న పవన్ కళ్యాణ్ మైక్ దొరికినప్పుడల్లా నోటికి పనిచెబుతూ రెచ్చిపోతున్నారు. ఎప్పుడూ ఆవేశంగా, అసహనంతో రగిలిపోతూ , మైక్ తో ఊగిపోతూ అయోమయ ప్రసంగాలు చేస్తూ వచ్చిన కార్యకర్తలను అయోమయానికి గురి చేసే పవన్ కళ్యాణ్ ఇకపై ఒక సబ్జెక్టుని ఎంచుకుని ఆ సబ్జెక్టుపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. కానీ ఇవేమి బుర్రకు ఎక్కించుకోని పవన్ కళ్యాణ్ తన సహజశైలిలో ఆవేశంగా ఊగిపోతూ తన అసహనం, కోపాన్ని చేతల్లో కాకుండా మాటల్లో చూపుతూ ఆంధ్రా ఓటర్లని ఎంటర్టైన్ చేస్తున్నారు.