ఐపీఎల్ 2024 భాగంగా నేడు 46వ కీలక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి , చెన్నై లోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది . ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. గత రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓడిపోయింది , మరోవైపు గత మ్యాచులో ఆర్సీబీ చేతిలో ఓడిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తోంది.
ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడగా 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడగా 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. జట్టు బలాబలాలు చూస్తే ఇరు జట్లు సమఉజ్జీవులుగానే కనిపిస్తున్నాయి , సొంత గ్రౌండ్ కావడం చెన్నైకి కలిసొచ్చే అంశం.