ఐపీఎల్ 2024 నేపథ్యంలో నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది . గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గెలుపును నమోదు చేసుకుని అదే ఆత్మవిశ్వాసంతో కొనసాగాలని చూస్తోంది.
ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 5 ఓటములతో 7వ స్థానంలో ఉండగా, బెంగళూరు ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 2 మ్యాచ్ లు మాత్రమే గెలిచి 7 మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 10 వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితిలో బెంగళూరు జట్టు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఆర్సీబీ , గుజరాత్ టైటాన్స్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో గుజరాత్ 2, బెంగళూరు ఒకటి గెలుపొందాయి.