ఏ రాజకీయ పార్టీలకైనా ప్రచారాలు అనేవి చాలా కీలకం.. ఎన్నికల బరిలో ఉన్నప్పుడు అవి మరింత ముఖ్యం. అయితే ఆ ప్రచారాలు ప్రజలకు మంచి చేసేవిగా మేలుకొలుపుగా ఉంటే మంచిదే.. కానీ అవి పరిధి దాటితే సమాజానికి చాలా ప్రమాదం. అవి అబద్ధపు ప్రచారాలు అసత్య ప్రచారాలు అయితే మాత్రం కచ్చితంగా నష్టపోయేది జనమే… ఈ కోవలోకి చెందుతుంది ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీరు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ తమ పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయండని నేరుగా ప్రజల వద్దకు వెళ్తుంటే.. తెలుగుదేశం పార్టీ మాత్రం తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. రేపు జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని డబ్బులు ఇచ్చి మరి విపరీతమైన మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తుంది.
అయితే ఈ క్యాంపెయిన్ ప్రశాంత్ కిషోర్ కేంద్రంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్నారై వింగ్ దీనికి సంబంధించిన ఖర్చులు భరిస్తోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరొకపక్క తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని, కావాలంటే కోట్ల రూపాయలు బెట్టింగ్ పెడతాము అని ఫోన్లు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జరిగిన అనేక సర్వేలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 120 సీట్లు గెలుస్తోందని తేల్చి చెబుతున్నాయి. కానీ ఓటర్లలో లేనిపోని భయాలు క్రియేట్ చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.