లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది బృందం మేనిఫెస్టోను రూపొందించింది. 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు బీజేపీ […]
తిరుపతిలో బీజేపీ నాయకుడు భానుప్రకాష్‌రెడ్డి అని ఉన్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం టీటీడీ ఈఓలు, చైర్మన్లపై అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలలో దళారీ వ్యవస్థను కట్టడి చేయడంతో సదరు కమలం పార్టీ నాయకుడి ఆటలు సాగకుండా పోయాయి. దీంతో రోజూ ఎల్లో మీడియాలో టీటీడీపై దుష్ప్రచారం చేస్తుంటాడు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తుంటాడు. ఇటీవల కూడా ఈఓ ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకర్‌రెడ్డి, ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. […]
రానున్న ఎన్నికల నేపథ్యంలో కూటమి పొత్తు ఖరారు అయింది. సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి. అభ్యర్థుల ప్రకటన జరిగిపోయి, ప్రచారంలో మునిగి తేలుతున్నారు. కానీ ఇప్పుడు అసలు సమస్య వచ్చి పడింది. టీడీపీలో కొంతమంది సీనియర్ నాయకులకు సీట్ నిరాకరించడంతో టీడీపీకి పనిచేయరని భావించిన చంద్రబాబు .. కొంతమంది నేతలను జనసేనలోకి పంపించి అక్కడ టికెట్లు వచ్చేలా చేశాడు. మరి కొంతమంది బీజేపీలోకి పంపి వారికి టికెట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా అది బెడిసి కొట్టినట్లు సమాచారం, […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీలో చేరిన రఘురామ కృష్ణంరాజులకు బీజేపీ షాక్ ఇచ్చింది. కూటమి తరపున సీట్ల మార్పునకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను బీజేపీ తిరస్కరించింది. దీంతో నరసాపురం ఎంపీ టికెట్‌పై రఘురామ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఇటీవల జరిగిన జెండా సభలో కూటమి తరుపున నర్సాపురం ఎంపీగా తానే పోటీ చేస్తానని రఘురామ ప్రకటించాడు. కానీ అనూహ్యంగా బీజేపీ నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను ప్రకటించింది. ఏపీ బీజేపీ […]
టీడీపీ పెట్టిన మొదట్లో మాది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి బీసీ లకు ఎక్కువ సీట్లు ఇచ్చేవారు. తర్వాత టీడీపీ బాబు చేతిలో పడ్డాక ఆ బీసీ ఓటు బ్యాంక్ అలాగే ఉండగా సీట్లు మాత్రం కోత పడుతూనే ఉన్నాయి. తన BC (బాబు క్యాస్ట్)ల కోసం BC లకు అన్యాయం చేసి చేసి అలసిపోయిన బాబు ఇప్పుడు మిగతా కులాల మీద సూటి పెట్టాడు. బీజేపీ-జనసేన తో పొత్తులో భాగంగా బీజేపీ కి 10 అసెంబ్లీ […]
ఎక్కడ ఏ తప్పుడు పని జరిగినా దాని వెనకాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు అన్నది విధితమే… మొన్న విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ కావచ్చు అంతకు ముందు జరిగిన అనేక సాంఘిక కార్యకలాపాలు కావచ్చు మూలాలు ఏంటి అని వెతికితే కచ్చితంగా దాని మూలాలు తెలుగుదేశం పార్టీలోనే కనబడ్డాయి.. ఆ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం డిఆర్ఐ అధికారులను బెదిరించిన నేపథ్యంలో టిడిపి జనసేన బిజెపి కూటమి ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ […]
ఎన్నికలు వస్తే చాలు ఎక్కడ లేని భయం బాబును ఆవహిస్తుంటుంది. ఆ భయం తో నే ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరో ప్లాన్, ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ అంటూ వరసగా ఒకేసారి పది ప్లాన్స్ వేసుకుని రెడీ గా ఉంటాడు. ఈసారి గతంలో లాగా బీజేపీ తో ఒకసారి, కాంగ్రెస్ తో ఒకసారి విడివిడిగా ఎన్నికలకు వెళ్తే వాళ్లు వెయ్యక, వీళ్లు వెయ్యక బొక్క బోర్లా పడ్డాం అని గ్రహించి […]
ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధా రంగ మిత్ర మండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర సాక్షి చర్చలో భాగంగా పలు సంచలన విషయాలు వెల్లడించారు. టీడీపీ గుప్పిట్లో ఏపీ బీజేపీ ఉందని పురంధేశ్వరి బీజేపీ కోసం పనిచేయడం లేదని, టీడీపీ కోసం పని చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. వంగవీటి నరేంద్ర వెల్లడించిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వంగవీటి నరేంద్ర బీజేపీ నుండి వైసీపీలో […]
ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కానీ ఈ దేశానికి రాష్ట్రపతి కన్నా ఎక్కువ గా భావిస్తుంటుంది. బాబు కోసం ఎందాకైనా అంటూ తన పరిధిలో లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటుంది. ఇప్పటికే తన పరిధిలో ఉన్న రాష్ట్ర బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ వారితో నింపేసి, ఫక్తు బీజేపీ నాయకులకు టికెట్ దక్కకుండా చేసిన ఘనత వహించారు కూడా. తాజాగా పురందేశ్వరి మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 22 మంది ఐపీఎస్ […]
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న తరుణంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రచారం సందర్బంగా చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీడీపీ పొత్తేమో ఎన్డీఏ కూటమితో ఉన్న, చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ వారికి చెందిన హెలికాప్టర్లు వినియోగిస్తున్నాడు. ఎన్నికల్లో చంద్రబాబు తన ప్రచార కార్యక్రమాల కోసం తన ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల హెలికాప్టర్లు, ఛాపర్లు వాడుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ప్రచార కార్యక్రమాల్లో ఒక చోటి నుంచి మరో చోటికి రాకపోకలు […]