టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీలో చేరిన రఘురామ కృష్ణంరాజులకు బీజేపీ షాక్ ఇచ్చింది. కూటమి తరపున సీట్ల మార్పునకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను బీజేపీ తిరస్కరించింది. దీంతో నరసాపురం ఎంపీ టికెట్‌పై రఘురామ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఇటీవల జరిగిన జెండా సభలో కూటమి తరుపున నర్సాపురం ఎంపీగా తానే పోటీ చేస్తానని రఘురామ ప్రకటించాడు. కానీ అనూహ్యంగా బీజేపీ నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను ప్రకటించింది.
ఏపీ బీజేపీ ఎన్నికల ఇంఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మనీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేశారు. అతని తరపునే మేం ప్రచారం చేయబోతున్నామని ప్రకటించారు. దీంతో చంద్రబాబు ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించిందనేది స్పష్టమవుతోంది.
నరసాపురం ఎంపీ సీటు కోసం రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా ప్రయత్నించారు. చంద్రబాబుతోనూ సంప్రదింపులు జరిపారు. చివరకు ఉండి అసెంబ్లీ సీటు మాట దక్కించుకుని, టీడీపీలో చేరారు. అయితే పాలకొల్లు టీడీపీ భేటీలో చంద్రబాబు రఘురామ కృష్ణంరాజును ఉండి అభ్యర్థిగా ప్రకటించగానే.. అక్కడి టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అప్పటికే టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, మరో టీడీపీ నేత కలవపూడి శివరామరాజు మధ్య ఉండి టికెట్ కోసం కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ మధ్యలో చంద్రబాబు రఘురామ పేరును ప్రస్తావనకు తేవడాన్ని టీడీపీ శ్రేణులు భరించలేకపోయాయి. టీడీపీలో చేరిన రఘురామ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. అటు నరసాపురం ఎంపీగా సీట్ దక్కించుకోలేక ,ఇటు ఉండి అసెంబ్లీ సీట్ దక్కించుకోలేక పోయాడు. చంద్రబాబు రఘురామకు అసలు సీట్ కేటాయిస్తాడో లేదో అని రానున్న రోజుల్లో తేలనుంది..