ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధా రంగ మిత్ర మండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర సాక్షి చర్చలో భాగంగా పలు సంచలన విషయాలు వెల్లడించారు. టీడీపీ గుప్పిట్లో ఏపీ బీజేపీ ఉందని పురంధేశ్వరి బీజేపీ కోసం పనిచేయడం లేదని, టీడీపీ కోసం పని చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. వంగవీటి నరేంద్ర వెల్లడించిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
వంగవీటి నరేంద్ర బీజేపీ నుండి వైసీపీలో ఇటీవల చేరిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో తాను టీవీ చర్చల్లో పాలోన్నప్పుడు టీడీపీని విమర్శించే ప్రయత్నం చేస్తే బీజేపీ అడ్డుకుంటు వచ్చిందని, టీడీపీని విమర్శిస్తే టీవీ డిబేట్ లకు వెళ్లొద్దని రాష్ట్ర బీజేపీ చెప్పిందని నరేంద్ర ఆరోపించారు. రాష్ట్ర బీజేపీని టీడీపీ కబళించి వేసిందని ఏపీ బీజేపీ టీడీపీ గుప్పిట్లో ఉందని వెల్లడించారు.
ఈమధ్య దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అయ్యిందని తెలిసి ఆమెను అభినందించడానికి వెళితే అక్కడ మొత్తం టీడీపీ నుంచి బీజేపీ లోకి వెళ్లినవాళ్ళే ఉన్నారని పైగా బాబు అరెస్ట్ అక్రమం అని చంద్రబాబుకు సపోర్ట్ గా మాట్లాడుకొంటున్నారని నరేంద్ర వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి బీజేపీ కోసం పనిచేయడం లేదని చంద్రబాబు కోసం పనిచేస్తుందని చంద్రబాబు చెప్పినవాళ్ళకే అటు బీజేపీలో ఇటు జనసేనలో టికెట్లు ఇస్తున్నారని, పురంధేశ్వరి బాబు సాయంతో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవ్వాలని ట్రై చేస్తోందని వంగవీటి నరేంద్ర సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి..