లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది బృందం మేనిఫెస్టోను రూపొందించింది. 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు బీజేపీ అధ్యక్షడు జేపీ నడ్డా మీడియాతో వెల్లడించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫేస్టో కమిటీ 15 లక్షల మంది నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు మోదీ తెలిపారు. కాగా ఈ మానిఫెస్టోలో అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు మోదీ సారథ్యంలో బీజేపీ అనుసరించబోయే విధానాలను వివరిస్తూ మేనిఫెస్టోను విడుదల చేసినట్లు రాజనాథ్ సింగ్ తెలిపారు. .
మేనిఫెస్టోను మొత్తం 14 అంశాలతో రూపొందిచినట్లు తెలిపారు. సమృద్ధ్ భారత్, విశ్వబంధు, సురక్షిత భారత్, ప్రపంచస్థాయి మౌలికవసతుల కల్పన, స్వచ్ఛ భారత్, ఈజ్ ఆఫ్ డూయింగ్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సాంకేతిక వికాసం, సంతులిత అభివృద్ధి ,ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, స్వచ్చ భారత్, సుపరిపాలనవంటి అంశాలను చేర్చింది. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రధాని మోదీ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.