ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కానీ ఈ దేశానికి రాష్ట్రపతి కన్నా ఎక్కువ గా భావిస్తుంటుంది. బాబు కోసం ఎందాకైనా అంటూ తన పరిధిలో లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటుంది. ఇప్పటికే తన పరిధిలో ఉన్న రాష్ట్ర బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ వారితో నింపేసి, ఫక్తు బీజేపీ నాయకులకు టికెట్ దక్కకుండా చేసిన ఘనత వహించారు కూడా.
తాజాగా పురందేశ్వరి మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 22 మంది ఐపీఎస్ లను బదిలీ చేయాలని ఎన్నికల కమీషన్ కు లేఖరాశారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా ఆవిడే ప్రతిపాదించారు. కనీసం వార్డ్ మెంబర్ కూడా కాదు, పోనీ పంచాయితీ కార్యదర్శి కూడా కాదు అలాంటి ఆమె ఏ హోదాలో ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించాలో సిఫారసు చేసే అధికారం తనకు ఎవరిచ్చారని రాజకీయ విశ్లేషకులు విస్మయానికి గురవుతున్నారు.. 22 మంది ఐపీఎస్ అధికారులు అధికార వైసీపీ పార్టీ కి అనుకూలంగా పని చేస్తున్నారని వారిని బదిలీ చేయాలని లేఖ రాయడం వరకు సరే కానీ వారి స్థానంలో ఎవరిని నియమించాలో చెప్పే అధికారం ఆమెకి ఎక్కడుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో తాము ఎంపిక చేసిన వారినే ఎన్నికల విధుల్లో ఉంచాలని ఆవిడ భావిస్తున్నది అనుకోవాలా? లేక తమకు నచ్చిన వారిని నచ్చిన చోట పెట్టుకునే అధికారం తమకు ఉందని ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారా?
అధికారులు ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశిస్తే ఈ దేశంలో ఇక ఎన్నికల ప్రక్రియ అవసరమే లేదు కదా. అంతిమంగా ప్రజా తీర్పుదే తుదినిర్ణయం కదా? అలాంటప్పుడు ఎన్నికల సమయంలో ఈ హడావిడి దేనికి సంకేతం. ఓడిపోయాక వెత్తుకోవాల్సిన సాకులను ముందే వెతుక్కుంటున్నట్లుగా ఉంది ఈ వ్యవహారం మొత్తం.
మరోపక్క ఈనాడు కూడా ఎవరెవరు బదిలీ అయ్యారు, వారి స్థానంలో కొత్తగా ఎవరు వచ్చారు అని రాస్తూ కొత్తగా వచ్చిన వారు కూడా వైసీపీ కి అనుకూలురే అంటూ ఓ కథనం రాసుకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులలో సీనియారిటీ ని బట్టి రాష్ట్ర సీఎస్ ఎన్నికల కమీషన్ కు సిఫారసు లేఖ రాయగా వారిలో నుండి కొంతమందిని ఈసి నే కొత్తగా నియమించింది. వారి నియామకాన్ని కూడా తప్పుబట్టి వారిపై వైసీపీ ముద్ర వేస్తూ కథనాలు రాయడం ఈనాడు విష పత్రికా విలువలకు నిదర్శనం. పోనీ ఎవరిని నియమించాలో మీరే చెప్పండి అంటే ఈనాడు రామోజీ ఐబీ వెంకటేశ్వర రావు, నిమ్మగడ్డ రమేష్ ల పేర్లు సిఫారసు చేసినా చేయగలరు. అదీ చాలకపోతే ఈనాడు జిల్లా స్టాఫర్ లను ఎస్పీ లుగా నియమించాలని కోరినా ఆశ్చర్యం లేదు.