Sslc అనగా సెకండరి స్కూల్ లివింగ్ సర్టిఫికెట్,టెన్త్ పరీక్షలు అన్ని సబ్జెక్ట్ లలో పాస్ అయ్యిన వారికి ఇస్తారు. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఈ sslc విధానాన్ని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య గారి హయాంలో అనగా 80 అక్టోబర్ నుండి 82 పిబ్రవరి మద్య కాలంలో రద్దు చేసి ssc విధానాన్ని ప్రవేశ పెట్టారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎడ్యుకేషన్ వద్దకు వద్దాం, నిన్న నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ అందులో తన విద్యార్హత SSLC 10 th అని స్పష్టంగా పేర్కొన్నది దిగువ చిత్రంలో మనం గమనించవచ్చు . october 1980 – February 1982 మధ్య రద్దు అయిన SSLC టెన్త్ సర్టిఫికెట్ పవన్ కళ్యాణ్ ఎలా పొందగలిగాడు .
Sslc రద్దయిన కాలాన్ని బట్టి చూస్తే చివరిగా 1981 మార్చ్ లో టెన్త్ రాసిన వారికి మాత్రమే SSLC సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంది. మరి ఇది పవన్ కళ్యాణ్ ఎలా పొందాడు అంటారా?. Thats the magic.
ఏదైనా ఒక విద్యా విధానం రద్దయ్యిన కాలంలో పరీక్ష రాసి ఫెయిల్ అయ్యిన విద్యార్ధికి మరుసటి ఏడాది కూడా పాత విధానంలోనే పరీక్ష రాసి సర్టిఫికెట్ ఇచ్చే సంస్కృతి మన విద్యా వ్యవస్థలో ఉంది. ఆ వెసులుబాటు ఉపయోగించుకొన్న పవన్ కళ్యాణ్ 1981 లో టెన్త్ పరీక్ష రాసి ఫెయిల్ అయ్యిన తర్వాత పట్టు వదలని విక్రమార్ఖుడిలాగా వరుసగా 1982, 1983 లో కూడా టెన్త్ ఫెయిల్ అయ్యి ఎట్టకేలకు 1984 లో టెన్త్ పాసయ్యి SSLC పాసయ్యి ఉండొచ్చు.
ఆ విధంగా రాష్ట్రంలో SSLC సర్టిఫికెట్ అందుకొన్న చిట్ట చివరి విద్యార్థి మన పవన్ కళ్యాణ్. అలాగే టెన్త్ నాలుగు సంవత్సరాలు చదివిన మొదటి రాజకీయ నాయకుడు కూడా మన పవనే.
ఈ ప్రకారం పవన్ వయసు కూడా గూగుల్ లో సమాచారం ప్రకారం 52 అన్నది, అఫిడవిట్ లో 55 ఏళ్ళు అన్నది కూడా అబద్దమే . 1981 లో టెన్త్ పరీక్ష రాసాడంటే అప్పటికి 15 ఏళ్ళు ఉంటాయి. అంటే 1966 లో పుట్టినట్టు. ఆ ప్రకారం పవన్ వయసు ఇప్పుడు 58.
SSLC రద్దు గురించిన సమగ్ర సమాచారం ఎడ్యుకేషన్ బోర్డు నుండి తీసుకొని, అలాగే పవన్ టెన్త్ సర్టిఫికెట్ తీసుకోని పరిశీలించి చూస్తే కానీ ఈ అంశాలకు ముగింపు పలకటం సాధ్యం కాదు.