ప్రతీ నియోజకవర్గంలో యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రతీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతామని సీఎం జగన్ వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
రాష్ట్రంలో స్కిల్ మీద ప్రత్యేకమైన ధ్యాస, శ్రద్ధ పెట్టబోతున్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ ద్వారా ఐటిఐ, డిప్లమో, పాలిటెక్నిక్ డ్రాప్ అవుట్స్ ముగ్గురిని కలిపి ఒకే ప్లాట్పాంలోకి తీసుకువచ్చి, ఒక స్కిల్ హబ్ గా దాని తయారు చేస్తాం. దీని వల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్ షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది.. దీనికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ, రాష్ట్రంలో 175 స్కిల్ హబ్స్, జిల్లా కేంద్రాల్లో 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాం. యూనివర్సిటీ డైనమిక్ గా కోర్సులను ఇవాల్వ్ చేస్తుంది.
ఇండస్ట్రీ ని ఇందులో భాగస్వామ్యం చేస్తుంది. ఇండస్ట్రీలను కలుపుకుంటూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ను ఇందులోకి తీసుకువస్తూ, డైనమిక్ గా ఈ కోర్సులను వాళ్లందరికీ ఇంపాక్ట్ చేస్తుంది. ఈ స్కిల్ కాలేజీలను నెలకొల్పడమే కాకుండా, ఇక్కడ సీట్ తెచ్చుకుని, మనం ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తామో, వారికి పెయిడ్ ఇంటర్న్‌షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెలకు రూ.2,500 అబ్బాయిలకు, రూ.3,000 వరకు అమ్మాయిలకు ఇవ్వడం జరుగుతుంది.
వచ్చే ఐదేళ్లు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన ఇవన్నీ కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చి, మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కూడా నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తున్నాం.
2025 నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యా విధానం. ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ ను పెంచుకుంటూ 2035 నాటికి పదవ తరగతి విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న టోఫెల్ క్లాసులు మూడో తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి. ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రత్యేక ట్యాబ్‌లు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్ లో ఉన్న 3,295 అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి త్వరితగతిన పూర్తి చేస్తాం.
డిజిటల్ ఎడ్యుకేషన్ లో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తే అడుగులు ముందుకు వేస్తున్నాం.
వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీని రానున్న ఐదేళ్లలో హెల్త్ ను మరింత సీరియస్ గా తీసుకుంటాం. ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా విస్తరించాం. ప్రొసీజర్స్‌ను1,050 నుండి 3,300 కు పెంచాం. నెట్వర్క్ హాస్పిటల్స్ నెంబర్ కూడా బాగా పెంచడం జరిగింది.
ప్రివెంటివ్ కేర్ లో ఎవరూ చూడని అడుగులు కూడా పడ్డాయి. విలేజ్ క్లినిక్ లు గ్రామస్థాయిలో తీసుకురావడం, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా వచ్చాయి. ఆరోగ్య రంగం మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టాలి. ప్రొసీజర్లను ఈసారి ఇంకా పెంచాలి అని అధికారులకు చెప్పడం జరిగింది. నియామకాల విషయంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 61% ఉంటే మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%. 54 వేల పోస్టుల రిక్రూట్మెంట్ కేవలం వైద్యరంగంలో జరిగింది.
ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పటికే నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసేలా అడుగులు ముందుకు పడుతున్నాయి. గుండెకి సంబంధించి విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 మెడికల్ హబ్ లు..గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు.. కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు.. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు.