తిరుపతిలో బీజేపీ నాయకుడు భానుప్రకాష్‌రెడ్డి అని ఉన్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం టీటీడీ ఈఓలు, చైర్మన్లపై అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలలో దళారీ వ్యవస్థను కట్టడి చేయడంతో సదరు కమలం పార్టీ నాయకుడి ఆటలు సాగకుండా పోయాయి. దీంతో రోజూ ఎల్లో మీడియాలో టీటీడీపై దుష్ప్రచారం చేస్తుంటాడు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తుంటాడు. ఇటీవల కూడా ఈఓ ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకర్‌రెడ్డి, ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. బీజేపీలో పెద్దలందరూ తెలుసు. ఏమైనా చేయగలనని బిల్డప్ ఇచ్చి వసూళ్లకు పాల్పడే భానుప్రకాష్‌రెడ్డికి ఘనమైన చరిత్రే ఉంది.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడి ద్వారా భానుప్రకాష్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడయ్యాడు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వీఐపీ, వీవీఐపీలకు శ్రీవారి దర్శనాల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాడు. కమలం పార్టీ కార్యకర్తలకు ఒక్క దర్శనం టికెట్ కూడా ఇప్పించలేదని విమర్శలున్నాయి. కోటా టికెట్లను తిరుపతిలోని స్టార్ హోటళ్లకు అమ్మేసి కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నాడు. ఇతర రాష్ట్రాలోని బీజేపీ నేతలకు శ్రీవారి దర్శనాలను అడ్డు పెట్టుకుని ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగాడు. భానుప్రకాష్ అడిగినన్ని బ్రేక్ దర్శనాలు ఎప్పుడు అడిగినా ఇవ్వాలి. లేకపోతే టీటీడీపై లేనిపోని ఆరోపణలు చేస్తాడు. ప్రస్తుత ఈఓ, చైర్మన్ అతని ఆగడాలకు చెక్ పెట్టడంతోనే వారిపై దుష్ప్రచారానికి దిగాడు. జగన్ ప్రభుత్వాన్ని జనంలో చులకన చేయొచ్చని ఎల్లో మీడియా ఇతడిని డిబేట్లను పిలిచి ఎంకరేజ్ చేస్తోంది. టీటీడీలో పనిచేస్తున్న అధికారులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనరు. వారు ఈసీ పరిధిలోకి రారు. అయినా ఈఓని బదిలీ చేయాలంటూ మీడియాలో రగడ చేస్తున్నాడు భానుప్రకాష్‌రెడ్డి.
భానుప్రకాష్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగితే నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటూ కొంతకాలం క్రితం వసూళ్లు చేసేశాడు. దర్శనాలు చేయించిన పరిచయాలతో మన రాష్ట్రంతోపాటు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర చోట్లకు చెందిన వ్యాపారుల నుంచి రూ.10
కోట్ల వరకు దండాడని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి విలువలేని వ్యక్తుల మాటలు పట్టుకుని పచ్చ గ్యాంగ్ టీటీడీ నాశనమైపోయిందని గగ్గోలు పెడుతోంది. కానీ నిజాలేంటో ఆ దేవుడికే తెలుసు.
– వీకే..