సినీ హీరోల్లో కొందరు మినహా మిగిలిన వారు తమ అభిమానులను బాగా చూసుకుంటారు. సినిమా విడుదల ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు విచ్చేసే వారిని నిర్లక్ష్యంగా ఉండొద్దని, జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లాలని సూచిస్తుంటారు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులను సైకోలుగా తయారు చేసేశాడు. అంతటితో ఆగకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. పవన్ నామినేషన్ సందర్భంగా చాలామంది అభిమానులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మద్యం తాగి చొక్కాలు తీసేసి మోటార్బైక్ల్లో స్పీడ్‌గా తిరిగారు. హారన్ మీద నుంచి వేళ్లు తీయకుండా ధ్వని కాలుష్యానికి కారణమయ్యారు. కొందరు నిర్లక్ష్యంగా చెట్లు ఎక్కి ఫొటోలు తీస్తూ కనిపించారు. అక్కడి నుంచి పడి ప్రాణం మీదకు వస్తే ఎవరూ పట్టించుకోరనే విషయం వారికి ఇంకా అర్థమైనట్లు లేదు.
పవన్‌ను అభిమానించే వారిలో చాలామందికి క్రమశిక్షణ లేదు. గతంలోనూ అనేక సందర్భాల్లో అది రుజువైంది. జనసేన మీటింగ్‌లు కావొచ్చు. సేనాని సినిమా విడుదల ఫంక్షన్లు కావొచ్చు. నోటికి అడ్డూ అదుపు లేకుండా అరుస్తూనే ఉంటారు. హద్దులు మీరి ప్రవర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అక్కడి వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వారికి అలవాటు. తోటి హీరోల ఫ్యాన్స్‌తో ఏనాడూ సఖ్యతగా ఉండరు. సినిమా హాళ్ల వద్ద గొడవలు పడి రచ్చ చేసిన ఘటనలున్నాయి. ఏ మీటింగ్ అయినా సరే పనవ్ పేరుతో అరుస్తూ ఉంటారు. సీఎం సీఎం అని కేకలు చేస్తుంటారు. వీరిని పవన్ సన్మార్గంలో నడిపించాలని పవన్ ఎప్పుడూ భావించలేదు. అరవండి అరవండి అంటూ రెచ్చగొట్టేవాడు.
నామినేషన్ సందర్భంగా అభిమానుల తీరును చూసి ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. పవన్ వారిని మందలించకుండా పోతేపోయారులే అనే విధంగా వ్యవహరించడం దారుణమని అభిప్రాయపడుతున్నారు. సేనానికి తన అభిమానుల సంక్షేమం ఏనాడూ పట్టదు. అప్పట్లో సినిమాల విడుదల సమయంలో ఫ్లెక్సీలు కడుతూ చనిపోయిన వారికి సంబంధించి కుటుంబాలను ఆదుకుంది లేదు. పైకి మాత్రం వంద చెబుతుంటాడు. కానీ చేసే పనులు వేరు. ప్రస్తుతం ఎన్నికల సభలు జరుగుతున్నాయి. వీటికి పవన్ హాజరవుతుండగా అతని అభిమానులు చేస్తున్న పనులు చూసి అందరూ అవాక్కవుతున్నారు. వీళ్లు సైకోలుగా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.