రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుంది అనే సెంటిమెంట్ వుంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం. అలాగే గుంటూరు జిల్లాలోని తెనాలి, అనంతపురం జిల్లాలో శింగనమల ఇలాంటి నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలో వుస్తుంది. చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆవిర్భావం తరువాత 1983,85లో టీడీపీ గెలిచింది ఆ సమయంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క 1989 లో టీడీపీ గెలిచినా ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ తిరిగి 1994,99లో టీడీపీ తరుపున గద్దె బాబూరావు గెలిచారు ఆప్పుడు కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004,2009 లో కాంగ్రెస్ పార్టీ నుండి బొత్స సత్యనారాయణ గెలుపొందారు అప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ విజయదుంధుబి మోగించింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో 2014 లో ఇక్కడ టీడీపీ నుండి మృణాళిని విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోనీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చారు ఇక్కడ వైసీపీ తరపున సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఘన విజయం సాధించారు.
మరో నియోజకవర్గం తెనాలిలో టీడీపీ ఆవిర్భావం తరువాత ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వున్న 1983,85 లో సత్యనారాయణ, 1994లో రవి రవీంద్రనాథ్, 1999లో గోగినేని ఉమ టీడీపీ నుండి గెలుపొందారు . ఈ సమయంలో టీడీపీ పార్టీనే అధికారంలో వుంది . అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న 1989లో నాదెండ్ల భాస్కరరావు, 2004, 2009లో నాదెండ్ల భాస్కరరావు కొడుకు అయిన నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. ఇక ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో 2014లో టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు అప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019లో వైసీపీ పార్టీ నుండి అన్నబత్తుని శివ కుమార్ విజయం సాధించారు.
ఇక శింగనమల నియోజకవర్గం చూస్తే టీడీపీ పార్టీ అధికారంలో వున్న 1983లో గురుమూర్తి, 1985,1994,1999 లో కొత్తపల్లి జయరాం, 2014 లో యామిని ఉమాబాల టీడీపీ పార్టీ తరపున విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న 1989 లో శమంతకమణి, 2004,2009 లో సాకే శైలజానాథ్ విజయం సాధించారు. ఇక వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 2019లో జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించారు. ఇలా ఈ నియోజకవర్గాల్లో మళ్ళీ 2024 లో ఏ పార్టీ వారు గెలుస్తారు అదే పార్టీ అధికారంలోకి వస్తుందని పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుండడం గమనార్హం.