ఎక్కడ ఏ తప్పుడు పని జరిగినా దాని వెనకాల తెలుగుదేశంపార్టీ నాయకులు ఉంటారు అన్నది విధితమే… మొన్న విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ కావచ్చు అంతకు ముందు జరిగిన అనేక సాంఘిక కార్యకలాపాలు కావచ్చు మూలాలు ఏంటి అని వెతికితే కచ్చితంగా దాని మూలాలు తెలుగుదేశం పార్టీలోనే కనబడ్డాయి.. ఆ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం డిఆర్ఐ అధికారులను బెదిరించిన నేపథ్యంలో టిడిపి జనసేన బిజెపి కూటమి ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ కు 41ఏ నోటీసులు జారీ జారీ చేయబడ్డాయి.
ప్రస్తుత సీఎం రమేష్ పరిస్థితి చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి పాప పనులు అన్న చందాన ఉంది. అనకాపల్లి తాలూకా చోడవరంలో జిఎస్టి చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్న డిఆర్ఐ అధికారులపై సీఎం రమేష్ దౌర్జన్యం చేసి బెదిరించిన సంగతి మనకు తెలిసిందే.. తమ విధులకు ఆటంకం కలిగించద్దని అధికారులు చెప్పిన సరే వినకుండా వారి చేతి లో ఫైల్స్ ని సైతం లాక్కొని రౌడీయిజం చేశాడు సీఎం రమేష్..
ఈ నేపథ్యంలోనే జీఎస్టీ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వ అధికారులకు ఇబ్బందులు కలగజేసిన సీఎం రమేష్ పై ఐపీసీ 353, 342, 506, 201, 188, 143/rw, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరుకావాలని అనకాపల్లి నుండి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసు విషయంలో ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తో పాటు చోడవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజుతో సహా మరో ఆరుగురిని పోలీసులు ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు. ఆది నుంచి నేర స్వభావం కలిగిన టిడిపిలో నేరస్తులే నాయకులుగా నేతలుగా ఉంటారు అనడానికి సీఎం రమేష్ ఉదంతమే ఒక ఉదాహరణ.