ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేటలో ఎస్ఎఎస్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం పెద్దలు, ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు వైసీపీ మైనారిటీ నాయకులు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముస్లింలు తమ బిడ్డల కోసం , భవిష్యత్తు తరాల కోసం వైసీపీనీ గెలిపించి అండగా ఉండాలని కోరారు. వైసీపీ గెలుపులో మొదటినుండి ముస్లింలకి ప్రత్యేక స్థానం ఉందని, అలాగే పార్టీలో అధినేత జగన్ మొదటి నుండి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని […]
డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్.. మొన్నటి వరకు నెల్లూరు సిటీలో తన మార్క్‌ని చూపించారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నరసారావుపేట పార్లమెంట్ ఇన్చార్జిగా తనదైనశైలిలో దూసుకెళ్తున్నారు. సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమోషన్ ఇచ్చి నరసారావుపేట పార్లమెంట్‌కు పంపారు. ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు, అధికారులను సమన్వయం చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. గత ఐదేళ్ల కాలంలో ప్రారంభించిన పనులు.. అవి […]
బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్‌ని “తంతే మూడు జిల్లాల అవతల పడ్డాడు” అని బాబు చేసిన కామెంటు ఇప్పుడు బాబుకి తలనొప్పిగా మారింది. గతంలో కూడా “యస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు” అని కామెంట్లు చేసిన బాబు, ఆపై దానిని కప్పి పుచ్చడానికి తన పచ్చ సోషల్‌మీడియా సైన్యాన్ని ఎగదోసి సమస్య తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నం చేసారు. అయితే ఇప్పుడు బీసీ నేతపై చేసిన కామెంటుని కూడా అలానే కప్పి పుచ్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. […]
నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుండి ప్రస్తుత ఎంపీ లావు కృష్ణదేవరాయలు కాకుండా బీసీ నేత అనిల్ కుమార్ ని జగన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అలాగే లావుని గుంటూరు నుండి పోటీ చేయమని నిర్ధేశించారు సీఎం జగన్ . ఈ అంశంలో మొదటి నుంచీ నరసరావుపేట ఎంపీ సీటు వైపే మొగ్గు చూపిన లావు కృష్ణదేవరాయలు సీటు విషయంలో నిరాశ ఎదురవడంతో అలకపూనారు. అసంతృప్తులకు ఆశ చూపించి రాజకీయం చేయడంలో సిధ్ధ హస్తుడైన చంద్రబాబు […]
జగనన్న విద్యా దీవెన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ “ఈ రోజు పామర్రుకు మన దేవుడు వచ్చాడు, చాలా సంతోషంగా ఉంది, నిత్యం ప్రజల్లో ఉండే మన సీఎంగారు ఎక్కడా కూడా కులం, మతం చూడలేదు, ఓటు వేశారా వేయలేదా అని కూడా చూడలేదు, జగనన్నా మా అందరి కోసం తోడేళ్ళన్నీ ఏకమైనా పచ్చ మీడియా విషప్రచారం చేసినా జగనన్న మన కోసం పోరాడుతున్నారు, విద్యా దీవెన కార్యక్రమానికి అన్న పామర్రు […]
పోరుకు నేను సిద్దం, మీరు సిద్ధమా అని జగన్ తన క్యాడర్ ను సమాయత్తం చేయడానికి నిర్దేశించిన సిద్దం సభ మొదటిది భీమిలి లో కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అవ్వగా, దానికి మించిన సభ దెందులూరు లో జరిగింది… ఇక సీమ లో జరిగిన రాప్తాడు సభ కి దాదాపు 12 లక్షల మంది హాజరయ్యారని జాతీయ మీడియా అంచనా వేసింది… తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ అంతెందుకు దేశంలోనే ఇంతవరకు ఆ స్థాయి సభ ఎన్నడూ […]
నరసరావుపేట లోక్ సభ సమస్వయకర్తగా నియమితులైన తరువాత తొలిసారి మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు (ఫిబ్రవరి 14, 2023) పల్నాడు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేశారు. నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఈ దఫా బీసీలకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించడంతో అనిల్ కుమార్ యాదవ్ సమన్వయకర్తగా నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యం లో […]
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏదైనా చేస్తా. జగనన్నకు నా ఉపయోగం ఏ ఊరిలో ఉంటే అక్కడికి వెళ్తా. ఎంపీగా పోటీ చేయాలన్నారు. సరేనన్నాను. ఆయన మాటకు అడ్డు చెప్పే ప్రసక్తే లేదు’ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలివి. జగన్ ఆయన్ను నరసారావుపేట పార్లమెంట్ ఇన్చార్జిగా నియమించిన విషయం తెలిసిందే. నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్‌ను సిటీకి సమన్వయకర్తగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆదివారం అనిల్ […]
త్వరలో జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సిటింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. కొందర్ని ఎంపీగా పంపుతున్నారు. మరికొందరికి వేరే సెగ్మెంట్లు అప్పజెబుతున్నారు. పలువురికి మరో రూపంలో అవకాశం ఇస్తామని చెప్పి కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యే టికెట్ లేదని ముందుగానే తెలుసుకుని తెలుగుదేశానికి అమ్ముడుపోయారు. మరికొందరు మాత్రం రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పించిన జగన్‌తోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విషయం ఎల్లో మీడియాకు నచ్చడం […]
‘నేను ఎమ్మెల్యే, మంత్రి కావడానికి కారణం జగనన్న. ఆయన మాటే నాకు వేదం. అధినేత గీత గీస్తే దాటను. వచ్చే ఎంపీ ఎన్నికల్లో పల్నాడు ప్రజల ఆశీస్సులు నాకు కావాలి’ అంటూ నరసారావుపేట పార్లమెంట్ స్థానంలో కొద్దిరోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు నెల్లూరు సిటీ శాసనసభ్యుడు డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ తెరదించారు. తానే అభ్యర్థినని చెప్పకనే చెప్పారు. పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన రావాడమే ఇక మిగిలింది. నెల్లూరు రూరల్‌లో జన్మించిన అనిల్ చెన్నైలో వైద్య విద్యనభ్యసించారు. 2008లో […]