నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుండి ప్రస్తుత ఎంపీ లావు కృష్ణదేవరాయలు కాకుండా బీసీ నేత అనిల్ కుమార్ ని జగన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అలాగే లావుని గుంటూరు నుండి పోటీ చేయమని నిర్ధేశించారు సీఎం జగన్ . ఈ అంశంలో మొదటి నుంచీ నరసరావుపేట ఎంపీ సీటు వైపే మొగ్గు చూపిన లావు కృష్ణదేవరాయలు సీటు విషయంలో నిరాశ ఎదురవడంతో అలకపూనారు. అసంతృప్తులకు ఆశ చూపించి రాజకీయం చేయడంలో సిధ్ధ హస్తుడైన చంద్రబాబు లావుకు పేట ఎంపీ సీటు ఎరగా వేసి టీడీపీలోకి లాక్కున్నారు.
నిన్న గురజాలలో జరిగిన రా కదిలి రా సభలో లావుని టీడీపీలో చేర్చుకొన్న చంద్రబాబు ఆ తర్వాత , నెల్లూరులో జరిగిన కదిలిరా సభలో ప్రసంగిస్తూ “నెల్లూరులో తంతే మూడు నియోజకవర్గాల అవతలపడ్డాడు అనిల్ కుమార్ యాదవ్” అని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.
ఒక బీసీ నేతనీ, ఎంపీగా పోటీ చేయబోతున్న అభ్యర్థిని స్థాయి తక్కువ చేస్తూ విమర్శలు చేయడంతో ఆగ్రహించిన అనిల్ కుమార్ యాదవ్, “నరసరావుపేటలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం . నేను గెలిస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధం .నా సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబు లోకేషులకు ఉందా” అంటూ టీడీపీ నేతకు, ఆయన తనయుడికి బహిరంగ సవాల్ విసిరారు. ఇప్పటికే గెలుపా ఓటమా అంటూ మల్లగుల్లాలు పడుతున్న బాబు కొడుకులకి ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉందో లేదో???