పోరుకు నేను సిద్దం, మీరు సిద్ధమా అని జగన్ తన క్యాడర్ ను సమాయత్తం చేయడానికి నిర్దేశించిన సిద్దం సభ మొదటిది భీమిలి లో కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అవ్వగా, దానికి మించిన సభ దెందులూరు లో జరిగింది… ఇక సీమ లో జరిగిన రాప్తాడు సభ కి దాదాపు 12 లక్షల మంది హాజరయ్యారని జాతీయ మీడియా అంచనా వేసింది… తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ అంతెందుకు దేశంలోనే ఇంతవరకు ఆ స్థాయి సభ ఎన్నడూ జరగలేదు… ఒకదాన్ని మించి మరొకటి ప్రతిపక్షాల గుండెలు గుభేలు అయ్యేలా మోత మోగించాయి సిద్ధం సభలు…..
ఈ నేపథ్యం లో మార్చ్ మూడున పల్నాడు లో సిద్ధం సభ జరగనుంది… వైసీపీ కి భీభత్సమైన బలం ఉన్న పల్నాడు లో సభ అంటే, అందులోనూ గత మూడు సభలకి వచ్చిన స్పందన దృష్ట్యా ఇప్పుడు పల్నాడులో జరగబోయే సభ ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుట్టించబోతుంది…
ఈ మధ్యే నర్సారావు పేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ని వైసీపీ అధిష్టానం ఖరారు చేయడంతో క్యాడర్ లో మరింత జోష్ నిండింది. 2019 ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలో 7 కి 7 సీట్లు వైసీపీ సొంతం చేసుకోగా మరోసారి ఈ 7 స్థానాలు కైవసం చేసుకోడానికి వైసీపీ పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తుంది… ఒక పక్క మాస్ లీడర్ అయిన అనిల్, మరోపక్క పిన్నెల్లి బ్రదర్స్, జిల్లా వ్యాప్తంగా తమ మార్క్ ని ప్రదర్శించడానికి “సిద్ధం” గా ఉన్నారు…
అనూహ్యంగా సిట్టింగ్ ఎంపీ లావుని కాదని అనిల్ కు నర్సరావుపేట ఎంపీ టికెట్ ను కేటాయించడంతో మరోసారి టీడీపీ పల్నాడు జిల్లా మొత్తాన్ని మర్చిపోవాల్సిన స్థితి ఏర్పడింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత కు పల్నాడు ఎంపీ టికెట్ ఇవ్వడం ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ కానుంది.. అనాదిగా బీసీ ఓట్లతో సీట్లు గెలిచి వారి ఎదుగుదలను మరిచిన టీడీపీ ని జగన్ తన “బ్యాక్ బోన్ క్యాస్ట్” స్ట్రాటజీ తో వెన్ను విరిచాడు… ఒక్క పల్నాడు ప్రాంతం లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి బీసీ లకు ఇస్తున్న ప్రాధాన్యతా-ప్రాతినిధ్యాలకు బీసీలంతా ఈసారి జగన్ వైపు నిలబడబోతున్నారు అని బలమైన సంకేతాలు అందుతున్నాయి..
ఎన్నికల సన్నాహం అంటే ఏమిటో చెప్పడానికి సిద్ధం సభలు ట్రేడ్ మార్క్ గా మారాయి.. సిద్దం సభలకు ముందు వైసీపీ ఒక ఎత్తు, సిద్దం సభల తర్వాత వైసీపీ మరో ఎత్తు లా మారింది… సభలో జగన్ మోహన్ రెడ్డి అనర్గళంగా, సుదీర్ఘంగా తడబాటు లేకుండా ఈ ఐదేళ్లలో తానేం చేసింది, గత పాలనలో టీడీపీ చేయలేకపోయింది తాలుకా వివరాలను ప్రజలకు సూక్ష్మం గా వివరిస్తూ, తనను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయబోనని, కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానని భరోసానిస్తూ సాగుతున్న జగన్ ప్రసంగాలకు భారీ స్పందన లభిస్తుంది… క్యాడర్ లో కొత్త జోష్ కనపడుతుంది… జగన్ మోహన్ రెడ్డి వేదిక మీదకు రావడానికి 4-5 గంటల ముందే సభా ప్రాంగణమంతా నిండిపోతూ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మా జగన్ ని చూస్తే చాలు ఎంత కష్టం అయినా ఏం కాదు అంటూ ఎండలో ఉక్కపోతలో కూడా గంటలు గంటలు నిలబడి జగన్ కోసం ఎదురుచూడటం చూస్తుంటే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ జగన్ క్రౌండ్ పుల్లరే… జగన్ వెంటే జనం అనిపించక మానదు…
ఈ నేపథ్యం లో అతివీర భయంకర వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఉండే పల్నాడు జిల్లాలో జరగబోయే సిద్ధం సభకు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వేదిక కానుంది…. భీమిలి సభ జరిగినపుడు ప్రతిపక్షాల గుండెలు అదిరాయి, దాన్ని మించి దెందులూరు సభ, దాన్ని మంచి రాప్తాడు సభ సంచలనం శృష్టించగా.. ఇప్పుడు వైసీపీ క్యాడర్ కళ్ళే కాదు… టీడీపీ నాయకుల కళ్లు కూడా ఈ సభపైనే ఉండనున్నాయి…
వై నాట్ 175 అని జగన్ ఎందుకు అన్నాడో ఇప్పుడు టీడీపీ కి అర్ధం అయ్యుంటుంది…. జగన్ బలం ప్రజలే, అందుకే వాళ్లనే నమ్ముకున్నాడు… 2019 లో గెలిచిన 23 సీట్లు కూడా ఈసారి గెలుస్తామా లేదా అన్న ఆందోళన ప్రతిపక్షంలో కనపడుతుంది.. ఎన్నికలకి ముందే వారు కాడి దించేసినా ఆశ్చర్యం లేదు…