చిరంజీవి తమ్ముడు నాగబాబుమళ్లీ X లోకి తిరిగి వచ్చారు, “నా ట్వీట్ నేను డిలీట్ చేసుకున్నాను “ అంటూ ట్వీట్ చేసారు , అన్న చిరంజీవి తన వైఖిరిని మందలించినట్టు ఇప్పుడు నెటింట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ని ఉద్దేశించి “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే…! “ అంటూ నాగబాబు ట్విట్ చేయడం అందరికి తెలిసిందే. ఇదే అంశంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో సహా మెగా అభిమానులు కూడా విమర్శలు చేసుకోవడంతో పెద్ద వివాదంగా మారింది, ఈ నేఫథ్యంలో నాగబాబు తన X ఖాతాను తొలగించుకున్నారు.
అయితే నేడు మళ్లీ నాగబాబు తిరిగి వచ్చారు, స్నేహానికి రాజకీయానికి ముడిపెట్టి నాగబాబు చేసింది కరెక్ట్ కాదు, దీనివల్ల కుటుంబ విషయాల్లో కూడా వివాదాలు తలెత్తుతాయని చిరంజీవి నాగబాబును పిలిచి మందలించినట్టు ఒక పుకారు నడుస్తుంది. ఏమైతేనేమి తన తప్పును తెలుసుకు ట్విట్ డిలీట్ చేసి నాగబాబు మళ్లి తన ఖాతాలో యాక్టివ్ అయ్యారు, కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం వివాదాలకు దూరంగా ఉండే బన్నీపై వివాదస్పదంగా ఏమి కామెంట్ చేయవద్దని, ఇప్పటికైనా మంచి బుద్దితో మలుచుకోవాలని సలహాలు ఇస్తున్నారు.