బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్‌ని “తంతే మూడు జిల్లాల అవతల పడ్డాడు” అని బాబు చేసిన కామెంటు ఇప్పుడు బాబుకి తలనొప్పిగా మారింది. గతంలో కూడా “యస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు” అని కామెంట్లు చేసిన బాబు, ఆపై దానిని కప్పి పుచ్చడానికి తన పచ్చ సోషల్‌మీడియా సైన్యాన్ని ఎగదోసి సమస్య తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నం చేసారు. అయితే ఇప్పుడు బీసీ నేతపై చేసిన కామెంటుని కూడా అలానే కప్పి పుచ్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
దరిమిలా తెలుగు తమ్ముళ్ళందరూ, బాబుకి బీసీ అంటే ప్రేమ అని, నిజమైన బీసీల పార్టీ అంటే తెలుగు దేశమే అని పోస్టులు గుప్పిస్తున్నారు. గతంలో కూడా “గొర్రెలు కాచుకొనే అనిల్ యాదవ్ కి ఇరిగేషన్ మంత్రి పదవి ఇస్తే వరదలు రాక ఏమి వస్తాయి* అని టీడీపీ సోమ శేఖర్ చౌదరి చేత వీడియో చేయించినపుడు, లోకెష్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోని షేర్ చేసారు. తర్వాత వివాదం రాజుకునేలా ఉండేసరికి మెల్లగా దానిని తీసేసారు. సోమశేఖర్‌ని అరెస్ట్ చేసి పోలీసులు “పద్దతిగా” విచారిస్తే …నా వెనక టీడీపీ పెద్దలు సినీ దర్శకులు ఉన్నారు అని ..వాళ్ళు డబ్బు ఇస్తే ఇలా చేశాను అని చెప్పాడు కూడా.
ఇంక బీసే ప్రేమికుడు అని చెప్పుకునే బీసీ ద్రోహాలను గమనిస్తే… బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ 2017 మార్చి 21న కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. ఇంక బాబు బీసీలకు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్ధానాలను చూసుకుంటే అన్నీ తుంగలో తొక్కిన బాపతే. జగన్‌లా నిజంగా బీసీలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదు బాబు.
డీబీటీ, నాన్ డీబీటీతో కలిపి సీఎం జగన్ ఇచ్చిన మొత్తం- 4. 38 లక్షల కోట్లు కాగా, ఇందులో బీసీ వర్గాలకే రూ.1. 73 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరింది.
బీసీ మంత్రులు జగన్ క్యాబినెట్ లో 11 మంది ఉంటే,
బాబు క్యాబినెట్ లో-8 మంది ఉండేవారు.బీసీ లకు రాజ్యసభ ఎంపీలు, జగన్ ఇచ్చినది 4 అయితే బాబు ఇచ్చినది గుండు సున్నా.
బీసీలు అయిన బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా, తమ్మినేని సీతారామ్ స్పీకర్ గా అత్యున్నత పదవులు ఇచ్చిన మొనగాడు జగన్.
ఇంక బాబు పాలనలో చూస్తే సొంత కులస్తుడైన కోడెల స్పీకర్‌గా చేసారు. స్పీశాసనమండలిలో … బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు MLC పదవులు-29 (69 శాతం) చంద్రబాబు పాలనలో -18 (37 శాతం) గా ఉన్నాయి.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే ..ఒక్క బీసీలకే 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులు (46 శాతం) కేటాయించారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైసీపీ కైవశం చేసుకోగా 44 చైర్పర్సన్ పదవులు బీసీలకు 44 (53 శాతం) ఇచ్చారు. 14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా 9 చోట్ల చోట్ల మేయర్ పదవులు(64 శాతం) బీసీలకు ఇచ్చారు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని నమ్మి బీసీలకు పెద్దపీట వేసింది జగన్ మాత్రమే, బాబు కాదు.