రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేమంతా సిద్దం పేరిన బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు జగన్, నేడు 21వ రోజున బస్సుయాత్ర ఉత్తరాంద్ర విశాఖకు చేరిన విషయం తెలిసిందే. తొలి నుండి విశాఖని పరిపాలనా రాజధానిగా మార్చాలనే దృడ సంకల్పంతో ఉన్న జగన్ నేడు విశాఖలో జరిగిన సోషల్ మీడియా మీట్ లో మరోసారి తన ఆకాంక్షను సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో పంచుకున్నారు. కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన జగన్ విశాఖకు సిటీ […]
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల యుద్ధం మొదలైంది. ఎక్కడ చూసినా హోరాహోరీ పోరుతో పోటాపోటీ ప్రచారాలతో అభ్యర్థుల తమ ప్రచార కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. వైరి వర్గాల అభ్యర్థులు తమ నామినేషన్ కార్యక్రమాలతో తమ తమ బలాలను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఎక్కడ చూసినా పండగ వాతావరణం లో ఈ నామినేషన్ల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నిన్నటి రోజున జరిగిన నామినేషన్ కార్యక్రమం అత్యంత వైభవంగా […]
ఉమ్మడి కృష్ణ జిల్లాలో టీడీపీకి రోజుకో షాక్ తగులుతూనే వుంది.కూటమి పొత్తులో భాగంగా గన్నవరంలో టీడీపీ తరుపున యార్లగడ్డ వెంకట్రావు పోటి చేస్తున్నారు. అయితే యార్లగడ్డ కూటమిలోని మిగిలిన పార్టీలు అయిన బిజెపి,జనసేన పార్టీలను అసలు పట్టించుకోవడం లేదు, అవమానిస్తున్నారు అని బిజెపి నియోజకవర్గ నేత కొరప్రోలు శ్రీనివాసరావు కూటమి రెబల్ గా నామినేషన్ వేశారు,ఇక జనసేనకు చెందిన గన్నవరం ఇంచార్జీ చలమశెట్టి రమేష్ బాబు టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ పై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కూటమి […]
ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన టీడీపీ నాయకుడు నర్సీపట్నం నియోజకవర్గ ఇంచార్జీ అయిన అయ్యన్నపాత్రుడుకు తన సొంత తమ్ముడు సన్నాసి పాత్రుడు ఓపెన్ చాలెంజ్ విసిరారు. గత కొంతకాలంగా ఇద్దరి అన్నదమ్ముల మధ్య సవాల్ ప్రతి సవాల్ లతో నర్సీపట్నం రాజకీయం రంజుగా మారింది. గతంలో అన్న అయ్యన్నపాత్రుడి తరుపున నియోజకవర్గంలో తమ్ముడు సన్నాసి పాత్రుడు అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఎప్పుడైతే తన అన్న అయ్యన్నపాత్రుడు తన కొడుకులను రాజకీయంగా ముందుకు తెచ్చి తన్ని దూరం చేస్తున్నాడో […]
ఇప్పుడంటే మెగా సోదరులు ఒకరినొకరు పొగుడుకుంటూ.. కౌగలించుకుంటూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. అధికారం కోసం సహకారం అందించుకుంటున్నారు. ఒకప్పుడు ఇదే బ్రదర్స్ మాధ్య మాటల యుద్ధాలు ఒక స్థాయిలో జరిగాయి. అప్పట్లో చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వేరుగా ఉన్నారు. ఓ సందర్భంలో చిరంజీవి తన తమ్ముడి మాటలపై ఇలా స్పందించారు. ‘ఈరోజున కాంగ్రెస్ పార్టీ హఠావో అన్నారు. మా పార్టీ నిన్న, మొన్న పుట్టింది కాదు. వంద సంవత్సరాలకు పైనే చరిత్ర కలిగింది. నేను […]
చిరంజీవి గొప్ప నటుడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సినిమాల్లో కంటే నిజ జీవితంలో ఇంకా అద్భుతంగా నటిస్తాడు. తన స్వార్థం కోసం నాలుకను ఎన్ని మడతలైనా పెడతాడు ఈ బాసు. తాజాగా ‘టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టడం చాలా ఆనందంగా ఉంది. ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలి’ అని సీఎం రమేష్‌ను పక్కన పెట్టుకుని వీడియోలో అన్నాడు. రాజకీయాల్లో మెగా బిగ్ బ్రదర్ చేసిన విన్యాసాలు చూస్తే ఔరా అనిపించక మానదు. […]
టీడీపీ కి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రెబల్స్ బెడద ఎక్కువ అవుతున్నది దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు పోటి మీరే అంటూ ఖర్చులు పెట్టించి తీరా ఎలక్షన్ వచ్చే సరికి డబ్బులు ఎవరు ఎక్కువ పెట్టుకుంటే వారికే టికెట్ అనడంతో టీడీపీ కి ప్రతి జిల్లాలో రెబల్స్ బెడద ఎక్కువ అవుతున్నది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్న రెబల్స్ లేదా గ్రూపు గొడవలతో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు […]
‘నా ఖాజానాలోని కోట్ల రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఎవడు పడితే వాడు కట్టలు కట్టలు తీసుకెళ్తున్నాడు. జనంలో మాత్రం పాజిటివ్ వైబ్స్ రాలేదు. అందరూ కలిసి నన్ను ముంచేసేలా ఉన్నారు’ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) తన సన్నిహితుల వద్ద వెలిబుచ్చిన ఆవేదన ఇది. బడా పారిశ్రామికవేత్త అయిన వీపీఆర్‌కు చంద్రబాబు పెద్దపీట వేశారు. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఆయనకు నెల్లూరు ఎంపీ, భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్లు […]
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు 2024 సార్వత్రిక ఎన్నికలుకు సంబంధించి పిఠాపురంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూటమి నాయకులు ఇప్పటికే చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి ఎస్వీ యస్ యన్ వర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు సమాచారం . పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ ఈ విధంగా ఉండబోతుంది . ఈ రోజు ఉదయం 9.30 లకు గొల్లప్రోలు వై జంక్షన్ నుంచి […]
ఆంధ్రప్రదేశ్ లో మరో 20 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతూ మిగిలిన పార్టీలతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ఆఖరికి వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా చంద్రబాబు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ వెనుకంజ వేస్తూ ఉండటం జనసేన శ్రేణులను నిరాశకు […]