టీడీపీ కి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రెబల్స్ బెడద ఎక్కువ అవుతున్నది దీనికి ప్రధాన కారణం చంద్రబాబునాయుడు పోటి మీరే అంటూ ఖర్చులు పెట్టించి తీరా ఎలక్షన్ వచ్చే సరికి డబ్బులు ఎవరు ఎక్కువ పెట్టుకుంటే వారికే టికెట్ అనడంతో టీడీపీ కి ప్రతి జిల్లాలో రెబల్స్ బెడద ఎక్కువ అవుతున్నది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్న రెబల్స్ లేదా గ్రూపు గొడవలతో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పనబాకలక్ష్మి, ఆమె భర్త పనబాక కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీనీ వదిలి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాటలను నమ్మి 2019 లో టీడీపీ జాయిన్ అయ్యారు. వారికి తిరుపతి ఎంపి స్థానం , గూడూరు ఎంఎల్ఏ సీట్లు ఇస్తానని హామీ ఇచ్చి చివరకు పనబాకలక్ష్మి కి తిరుపతి ఎంపి స్థానం ఇచ్చి సరిపుచ్చాడు ఇక చేసేది ఏమీ లేక సర్డుకుపోయారు.
ఆతరువాత అనుకోని పరిస్థితుల కారణంగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు టీడీపీకి అభ్యర్థులు దొరక్క పనబాకలక్ష్మి ఏమో ఓడిపోయే సీటు నేను పోటి లో వుండను అంటే టీడీపీ అధిష్ఠానం పనబాకలక్ష్మినీ బతిమలాడుకొని పోటీలోకి దింపారు.ఆరోజు కూడా ఓటమీ చెందిన తరువాత మీకు మళ్ళీ తిరుపతి ఎంపీ,తన భర్త పనబాక కృష్ణయ్య కు గూడూరు ఎంఎల్ఏ సీట్లు ఇస్తాము అని ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు రాగానే తనకు మాత్రమే సాధ్యమైన వెన్నుపోటుతో ఇద్దరికి టికెట్ లు ఇవ్వలేదు సరికదా కనీసం కలిసి మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు.
చంద్రబాబు చేసిన అవమానంతో పనబాక దంపతులు టీడీపీ రెబల్స్ గా పనబాక కృష్ణయ్య గూడూరులో ఎంఎల్ఏగా, తిరుపతి ఎంపీగా పనబాకలక్ష్మి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగటానికి రంగం చేసుకుంటున్నారు. ఇది తెలిసిన ఎంఎల్ఏ , ఎంపీ టీడీపీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ చంద్రబాబు దగ్గరకు పరిగెత్తి ఇక్కడి పరిస్థితులు వివరించారు. ఇప్పుడు చంద్రబాబు పనబాక దంపతులకు ఏమైన హామీ ఇచ్చి పోటి నుండి విరమించేలా చేస్తారో లేక బాబు మాటలకు తలొగ్గకుండ పోటి లో నిలబడి తమ సత్తా చూపిస్తారో రాబోయే రెండు రోజుల్లో క్లారిటీ రానున్నది.