రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేమంతా సిద్దం పేరిన బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు జగన్, నేడు 21వ రోజున బస్సుయాత్ర ఉత్తరాంద్ర విశాఖకు చేరిన విషయం తెలిసిందే. తొలి నుండి విశాఖని పరిపాలనా రాజధానిగా మార్చాలనే దృడ సంకల్పంతో ఉన్న జగన్ నేడు విశాఖలో జరిగిన సోషల్ మీడియా మీట్ లో మరోసారి తన ఆకాంక్షను సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో పంచుకున్నారు.
కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన జగన్ విశాఖకు సిటీ ఆఫ్ డెస్టినీ అనే పేరు ఉందని , ఈ సిటీ ఆఫ్ డెస్టీనీనే రేపటి రోజున ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి డెస్టినీ అని ఇప్పటికే అనేక అభివృద్ది కార్యక్రమాలని విశాఖలో చేశామని , రేపటి రోజున ముఖ్యమంత్రి స్థానంలో ఇక్కడే ఉంటే ఇదే సిటీని హైద్రబాద్ , చెన్నై, బాంబే , మద్రాస్, బెంగుళ్ళూరు లాంటి మహానగరాలతో పోటీ పడే విదంగా అభివృద్ది అవుతుందని స్పష్టం చేశారు, అలాగే ఐటీ పరిశ్రమను మరింత అభివృద్ది చేసే విధంగా అడుగులు పడతాయని మరోసారి తన మనసులో మాటను చెబుతూ విశాఖ రాజధానిపై తన వైఖరిని కుండబద్దలు కొట్టేశారు జగన్.