ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన టీడీపీనాయకుడు నర్సీపట్నం నియోజకవర్గ ఇంచార్జీ అయిన అయ్యన్నపాత్రుడుకు తన సొంత తమ్ముడు సన్నాసి పాత్రుడు ఓపెన్ చాలెంజ్ విసిరారు. గత కొంతకాలంగా ఇద్దరి అన్నదమ్ముల మధ్య సవాల్ ప్రతి సవాల్ లతో నర్సీపట్నం రాజకీయం రంజుగా మారింది. గతంలో అన్న అయ్యన్నపాత్రుడి తరుపున నియోజకవర్గంలో తమ్ముడు సన్నాసి పాత్రుడు అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఎప్పుడైతే తన అన్న అయ్యన్నపాత్రుడు తన కొడుకులను రాజకీయంగా ముందుకు తెచ్చి తన్ని దూరం చేస్తున్నాడో అప్పటి నుండి సన్నాసి పాత్రుడు అన్నకు దూరం జరిగి అన్నకు వ్యతిరేఖంగా రాజకీయం చేస్తూ 2019లో వైసీపీలో జాయిన్ అయ్యి అన్నను ఓడించడంలో తన వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు తిరిగి 2024 ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ అన్నదమ్ముల మధ్య తిరిగి డైలాగ్ వార్ మొదలైంది.
నర్సీపట్నంలో మరిడిమాంబ అమ్మవారి జాతర నేపథ్యంలో సన్నాసిపాత్రుడు మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడి చీకటి కోణాలు అన్ని బయట పెడతాను, నర్సీపట్నంలో తన అన్న చేసిన రంగు రాళ్ళ దందా దగ్గరి నుండి ప్రతి అవినీతి బయట పెడతాను ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిట్లా గణేష్ ను ఒక్క ఓటుతో అయిన గెలిపించుకు తీరుతాం అంటూ శపథం చేసి సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా అమ్మవారికి ప్రజల డబ్బులతో చేపించిన నగలను నేను దేవాదాయ శాఖకు అప్పగించాను కానీ అయ్యన్నపాత్రుడు మాత్రం దేవుడి పేరుతో ప్రజల దగ్గరనుండి సేకరించిన అరు లక్షల రూపాయలను దేవాదాయ శాఖకు కు అప్పగించకుండ తన దగ్గరే వుంచుకున్నాడు వాటిని దేవాదాయశాఖకు ఎప్పుడు ఇస్తావ్ అంటూ చాలెంజ్ విసిరారు.
పాపం అయ్యన్నపాత్రుడికి నియోజకవర్గంలో ఏది కలిసి రావడం లేదు. ముఖ్య నాయకులు అంతా కొడుకు విజయ్ పోకడలను తట్టుకోలేక ఒక్కొక్కరిగా రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు తమ్ముడు సంచలన ఆరోపణలు చేశారు. అలాగే నియోజకవర్గంలో తనకు కీలక నేత ప్రజాబలం వున్న ఎర్ర పాత్రుడు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈ పరిస్థితులు చూసి అయ్యన్నపాత్రుడు ఏమి చెయ్యాలో అర్థం కాక ఆందోళనలో వున్నారు అని టిడిపి నేతలు గుస గుసలాడుతున్నారు నియోజకవర్గంలో.