గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు పేద ప్రజలకు మంచి చేసినటువంటి పరిస్థితులు లేవు. పేరుకు మాత్రమే ప్రకటనలు తప్ప ఏ దిగువ మధ్యతరగతి వాడికి, నిలువ నీడలేని నిరుపేదకు మంచి చేసినటువంటి దాఖలాలు మనకు కనీసం మచ్చుకకు కూడా కనపడవు. పేదలకు చంద్రబాబు మంచి చేయకపోగా చేసే వాళ్లపై ఎల్లో మీడియా సాక్షిగా దుమ్మెత్తిపోయటమనేది చంద్రబాబు రాజకీయ జీవితం తెలిసిన వాళ్ళకి బాగా అవగతమే.
అయితే 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైయస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పేదలకు పెద్దపీట వేస్తూ ఆయన ఇచ్చిన మేనిఫెస్టో నుంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వరకు అన్నీ కూడా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలబడ్డాడు. ఆ క్రమంలోనే ఆయన ఇచ్చిన మాటను తప్పకుండా చెప్పని వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. నిలువ నీడలేని నిరుపేదలకు ప్రాముఖ్యం కల్పిస్తూ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే ఆశని నిజం చేస్తూ అడుగులు ముందుకు వేశాడు..
కానీ పేదల బాగుపడితే ఓర్వలేని చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని 1,191 కేసులు వేయించాడు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే ఏపీ శ్రీలంకలా అయిపోతుందని తన అనుకూల మీడియా, అనుబంధ విభాగాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేయించాడు. వాలంటీర్లు వ్యవస్థ ద్వారా నడవలేని మంచానికి పరిమితమైన అనేకమంది వికలాంగులు వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ అందించే కార్యక్రమానికి కూడా తన అనుకూల వ్యక్తులతో కోర్టుల్లో కేసులు వేయించి మోకాలడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని అర్ధం చేసుకుని టిడిపి నేతలు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా సరే ప్రజలు నిలబెట్టి కడిగేస్తున్నారు.
ముఖ్యంగా వృద్దులు నిలదీసి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు తలలు పట్టుకొంటున్నారు.