2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల యుద్ధం మొదలైంది. ఎక్కడ చూసినా హోరాహోరీ పోరుతో పోటాపోటీ ప్రచారాలతో అభ్యర్థుల తమ ప్రచార కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. వైరి వర్గాల అభ్యర్థులు తమ నామినేషన్ కార్యక్రమాలతో తమ తమ బలాలను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఎక్కడ చూసినా పండగ వాతావరణం లో ఈ నామినేషన్ల కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నిన్నటి రోజున జరిగిన నామినేషన్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఇది నామినేషన్ కార్యక్రమమా లేక విజయోత్సవ ర్యాలీనా అనే ఏ సందేహం కలిగేలా నిర్వహించారు కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ రూరల్ నియోజక వర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కురసాల కన్నబాబుకు మద్దతుగా నియోజకవర్గ ప్రజలు మొత్తం బారులు తీరారు.
ఈ కార్యక్రమంలో దాదాపుగా 2000 బైకులు, 100కి పైగా కార్లతో దాదాపు 25,000 మందికి పై బడిన అభిమాన గణంతో కాకినాడ రూరల్ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా కురసాల కన్నబాబు నామినేషన్ వేశారు. ఇది నామినేషన్ కార్యక్రమమా లేక విజయోత్సవ ర్యాలీనా అనిపించేలా చేశారు. అయితే నియోజకవర్గంలో నుంచి ఎలాగైనా గెలిచి తీరుతాను అని శపధాలు చేసిన పంతం నానాజీకి ఈ నామినేషన్ కార్యక్రమం చెంపపెట్టుగా మారింది. అయితే కురసాల కన్నబాబుకు ప్రత్యర్థిగా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్న పంతం నానాజీ నామినేషన్ కార్యక్రమం జనాలు లేక పేలవంగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే…