ఉమ్మడి కృష్ణ జిల్లాలో టీడీపీకి రోజుకో షాక్ తగులుతూనే వుంది.కూటమి పొత్తులో భాగంగా గన్నవరంలో టీడీపీ తరుపున యార్లగడ్డ వెంకట్రావు పోటి చేస్తున్నారు. అయితే యార్లగడ్డ కూటమిలోని మిగిలిన పార్టీలు అయిన బిజెపి,జనసేన పార్టీలను అసలు పట్టించుకోవడం లేదు, అవమానిస్తున్నారు అని బిజెపి నియోజకవర్గ నేత కొరప్రోలు శ్రీనివాసరావు కూటమి రెబల్ గా నామినేషన్ వేశారు,ఇక జనసేనకు చెందిన గన్నవరం ఇంచార్జీ చలమశెట్టి రమేష్ బాబు టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ పై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కూటమి పొత్తు ధర్మం యార్లగడ్డ పట్టించుకోవడం లేదు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
యార్లగడ్డ వెంకట్రావు వైఖరి టీడీపీలో ఒకవైపు తన ఆర్ధిక బలంతో ఊపిరి పోశాడు. అదే సమయంలో తన విపరీత పోకడలతో మిగతా టీడీపీ నాయకులకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేసి వారిని ప్రచారానికి పిలవకుండా వుండటం వారి గ్రామాలకు వెళ్లినా సమాచారం ఇవ్వకుండా వుండటంతో టీడీపీ పార్టీలోని ముఖ్య నాయకులు అందరూ ఇప్పటికే తట్టాబుట్టా సర్దుకుని ఇంటికే పరిమితమైనారు. మరో వైపు కూటమిలోని మిగిలిన పార్టీలు అయిన బిజెపి, జనసేన పార్టీ నాయకులకు కనీస గౌరవం ఇవ్వకుండా పొత్తు ధర్మం పాటించకుండా వారిని అవమానించే సరికి ఈరోజు బిజెపి వారు కూటమికి రెబల్ గా నామినేషన్ దాఖలు చేసి పోటిలో నిలబడ్డారు. జనసేన వారు కూడా యార్లగడ్డ వైఖరి మీద గుర్రుగా ఉన్నారు ప్రచారానికి కూడా దూరంగా వున్నారు. ఇక బీసీ సామజిక వర్గానికి చెందిన కీలక నాయకులు అందులో యాదవ సామాజిక వర్గ నేతలు యార్లగడ్డ వైఖరితో టీడీపీకి దూరం జరిగారు.
అటు వైసీపీ అభ్యర్థి ఇప్పటికే ప్రచారంలో జోష్ మీద వున్నారు,తమ పార్టీ అధినేత జగన్ మేమంతా బస్సు యాత్ర విజయవంతం అవ్వడంతో పాటు పార్టీలో వున్న చిన్న చిన్న అసంతృప్తులు కూడా సర్దుకొని ఇప్పుడు ఒకటిగా కలిసి ప్రచారం చేస్తూ భారీ మెజార్టీ లక్ష్యంగా పని చేస్తున్నారు.
ఇప్పటికే గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు వైఖరితో కూటమిలో లుకలుకలు మొదలయినాయి ,ఇప్పటికైనా వెంకట్రావు తన పద్ధతి మార్చుకొని కూటమి పెద్దలకు సర్డిచెబుతారో లేదా అనేది మనం వేచి చూడాలి.