ఏపీలో రోజుకి మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే…
హిందూపురం సిద్ధమా? మిట్టమధ్యాహ్నం సమయం 12.10 గంటలు కావస్తోంది. అయినా కూడా ఏమాత్రం ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ, ఇంతటి అభిమానాన్ని పంచిపెడుతున్న ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతిసోదరుడికీ, ప్రతి స్నేహితుడుకీ మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్ చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.
మరో 9 రోజుల్లోఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది. ఈ రోజు జరగబోతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు. ఇవి రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే… పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడం. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండ చిలువ నోట్లో తలకాయపెట్టినట్లవుతుంది. పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేచి.. లకలకా అంటూ మీ దగ్గరకు వస్తుంది.
దేవుడి దయతో మీ చల్లని దీవెనలతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, ఇంతకముందెన్నడూ చూడని విధంగా ఈ 59 నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. నేను అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ జగన్ బటన్లు నొ క్కడం అన్నది గతంలోఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఈ రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ కాలంలో ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. చరిత్రలో ఇది ఎప్పుడైనా జరిగిందా?
రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పిన 99శాతం వాగ్దానాలు అమలు చేయడం ద్వారా ఈ 59 నెలల మీ బిడ్డ పాలన ఈ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టంగా నిల్చిపోయింది. గతంలో ఎప్పుడైనా ఎన్నికల సమయంలో మాత్రమే అబద్దాలు చెబుతూ మేనిపెస్టో ఇస్తారు .ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం. కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం అమలు చేసి… మళ్లీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకుని పోయి ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే.. అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే.
మీ బిడ్డ గడ,గడ మచ్చుకు కొన్ని పథకాలు చెపుతున్నాడు. మీరే ఆలోచన చేయండి. ఇవాళ మీ బిడ్డ చెబుతున్నఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా?, ఎప్పుడైనా చూశామా? అన్నది మీరే ఆలోచన చేయండి. మొట్టమొదటిసారిగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా గవర్నమెంటు బడి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయి. బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక అందుతుంది. బడులల్లో గోరుముద్ద అందుతుంది. పిల్లల చదువులకు అమ్మలను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒ డి, వారి పూర్తి ఫీజులతో ఏ తల్లి,తండ్రీ ఇబ్బందిపడకూడని ఓ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతదీవెన, అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీదవాళ్లను నిలబెట్టాలని వారికి సున్నావడ్డీ, ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వారి పేరిట గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో పాటు 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలను ఇవ్వడం కానీ, ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ జరిగిందా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో చూశామా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా ఓ రైతుభరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్ పుట్ సబ్సిడీ, పగటిపూటనే రైతన్నలకు పగటిపూటనే ఉచిత విద్యుత్ ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడగులు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?
ఓ వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు ఓ తోడు, ఓ చేదోడు, లాయర్లకు లా నేస్తం ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా?పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశచరిత్రలో ఎక్కడా ఉండదేమో? పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం. ఆరోగ్యశ్రీ మాత్రమే కాకుండా పేదవాడికి తోడుగా ఆరోగ్యఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్,ఇంటికే ఆరోగ్య సురక్షా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? ఆలోచన చేయండి.
గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్లినా గ్రామంలో గ్రామ సచివాలయం అందులో ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడే అందుబాటులో కనిపిస్తాయి. ప్రతి 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్ధ. మరో నాలుగు అడగులు ముందువేస్తే రైతన్నలను చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్ధలు కనిపిస్తాయి. అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇస్తూ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు ముందుకి వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లిషుమీడియం స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలోనే గ్రామానికే చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. గ్రామంలోనే మహిళా పోలీసు కనిపిస్తోంది. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్ లోనే దిశ యాప్ కనిపిస్తోంది. ఇటువంటివి అనేకం ఇప్పుడు మీ కళ్లెదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు మీరు ఇంతకముందు ఎప్పుడైనా చూశారా? ఇవన్నీ కూడా కేవలం ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో జరిగినమాట వాస్తవం అవునా ? కాదా?.
మరో వంక 75 ఏళ్ల ముసలాయన ఉన్నాడు. 14 ఏళ్లు పాటు 3 సార్లు సీఎం గా చేశానంటాడు. ఇదే చంద్రబాబును మీ సమక్షంలో అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్కటైనా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా?
ఈ పెద్దమనిషి చంద్రబాబు ఎలాంటి వాడో అందరికీ అర్ధం అయ్యేలా నాలుగు మాటలు మీ బిడ్డ చెబుతాడు. పిండి కొద్దీ రొట్టె అనేది ఒక సామెత. దానర్ధం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు. పిండి తగ్గితే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ తెలిసిన సామెత, నానుడి. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుది అయితే మాత్రం… ఆ పిండి, ఆ రొట్టె అన్నీ తాను, తనవారు తినేయడమే స్కీంగా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన.
చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ ఖాతాల్లోకి, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్కరూపాయి అయినా వేశాడా? అదే మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే, వారి చేతికే మీ బిడ్డ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తుంది. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీబిడ్డ ఈ డబ్బులు పంపించాడు.
మరి ఇదే డబ్బు చంద్రబాబు హయంలో ఎవరి జేబుల్లోకి పోయిందని మీరు అందరూ నిలదీయండి? చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడి ఎంతిచ్చారు? ఈనాడుకు ఎంత పోయింది ?ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది? టీవీ5 కి ఎంత పోయింది? వీరి జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయిందన్నది ప్రతి ఒక్కరూ చంద్రబాబునాయుడుని నిలదీయండి .అధికారంలోకి వచ్చేదాకా అబద్దాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు ఎలా ఉండాయి అంటే.. 2014లో ఈ పాంప్లెట్ (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికి పంపించాడు. గుర్తుందా అన్నా? 2014లో ఇదే ముగ్గురు ఫోటోలతో స్వయంగా చంద్రబాబు నాయుడుగారు సంతకం పెట్టి ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించాడు. అంతే కాకుండా అప్పట్లో వారి ఈటీవీ, ఏబీయన్, టీవీ5లోనూ కూడా అడ్వర్జైట్ మెంట్లతో ఊదరగొట్టారు.
2014లో ఎన్నికల వేళ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికీ పంపించాడు. నేను అడుగుతున్నాను. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2014లో ఆయన మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ పంపించిన పాంప్లెట్ లో ఏ ఒక్కటైనా చేశాడా? లేదా ? అని నేను మిమ్నల్నే అడుగుతున్నాను.ఇందులో చంద్రబాబు ముఖ్యమైన హామీలంటూ చెప్పినవి.. నేను చదువుతాను, అవి జరిగినవా ? లేదా అన్నది మీరే చెప్పండి. రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ జరిగిందా? ఈయన చెప్పిన మూడో ముఖ్యమైన హామీ. . ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను. రూ.25వేలు కథ దేవుడెరుగు కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల రుణాల మాఫీ జరిగిందా? ముఖ్యమైన హామీలు.. రెండోది చదువుతాను. చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ? ఈయన చెప్పిన హామీలు.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. మీ అందరినీ కూడా చంద్రబాబు పరిపాలన చేసిన ఆ 5 సంవత్సరాల్లో మీలో ఏ ఒక్కరిలో అయినా కూడా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా? దేవుళ్ల పేర్లుతో మహలక్ష్మి పథకం అని పెట్టి దానికీ ఎగనామం పెట్టాడు.
ఇంకా ముందుకు పోతే… ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల, నెలా రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. 5 సంవత్సరాలు, అంటే 60 నెలలు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా అందిందా? ఇంకా ముందుకు పోతే అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను. మూడు సెంట్లు స్ధలం ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా. మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? జరిగిందా రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల రుణాల మాఫీ జరిగిందా? ముఖ్యమైన హామీలు.. రెండోది చదువుతాను. చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ? ఈయన చెప్పిన హామీలు.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. మీ అందరినీ కూడా చంద్రబాబు పరిపాలన చేసిన ఆ 5 సంవత్సరాల్లో మీలో ఏ ఒక్కరిలో అయినా కూడా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా?
ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. నెల నెలా ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు, అంటే 60 నెలలు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా అందిందా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా. మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? మరో ముఖ్యమైన హామీ.. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? హిందూపురంలో కనిపిస్తుందా?
మరి ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలంటూ ఏకంగా ఆయన సంతకం పెట్టి… వీళ్ల ముగ్గురు ఫోటోలతో ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్ లలో ఒక్కటంటే ఒక్కటి జరిగిందా?పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదీ అమ్మేశాడు. మళ్లీ ఇవాళ ఏమంటున్నారు. ఇలాంటి వారిని నమ్మగలమా? ఇలాంటి వాళ్లంతా మళ్లీ ఏం చేస్తున్నారు. మళ్లీ ఇదే ముగ్గురు, మళ్లీ ఇదే కూటమి, మళ్లీ మేనిఫెస్టో అంటూ ప్రజలను మోసం చేసేందుకు సూపర్ సిక్స్ అంటున్నారు. అక్కా నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? నేను అడుగుతున్నాను. మరి ఇన్నిన్ని మోసాలు చేస్తున్నారు. పట్టపగలే మోసాలు చేస్తున్నారు.
నేను మీ అందరికీ ఒకటే చెబుతున్నాను. మన బ్రతుకులు మారాలన్నా.. వాలంటీర్లు మరలా ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలాన్నా.. లంచాలు, వివక్ష లేని వ్యవస్ధ అడుగులు ముందుకు పడాలన్నా.. మన పిల్లల చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మనవ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదు. సిద్ధమేనా?
మన గుర్తు ఫ్యాను. అక్కడో ఇక్కడో ఎక్కడో తెలియనివారు, మర్చిపోయిన వారు ఉంటే… అక్కా మన గుర్తు ఫ్యాను, అన్నా మన గుర్తు ఫ్యాను. తమ్ముడూ మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను. చెల్లీ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడుచేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి.
ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఈ రోజు మన వైయస్సార్ సీపీ తరఫున నిలబడుతున్న మన అభ్యర్థులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను.
ఇంతటి ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులే చూపిస్తున్న నా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ వెళ్లే ముందు మీ అందరితో ఒక చిన్న విషయం పంచుకుని వెళతాను. మీ అందరితో ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే… రాజకీయాలు దిగజారిపోయాయి. ఏ రకంగా కుట్రలు చేస్తున్నారు, ఏ రకంగా మోసాలు, కుట్రలు చేస్తున్నారు అన్నది నిజంగా మీరు చూస్తున్నారు. మొన్నటికి మొన్న వీళ్లే అవ్వాతాతలకు ఇంటికే వచ్చే ఫెన్షన్ ను అడ్డుకున్నారు. ఇదే చంద్రబాబునాయుడు గారికి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆయనే లెటర్ రాశారు. లేఖలో వాలంటీర్లు ఇంటికి రాకూడదు, వాలంటీర్లు ఇంటికి పోకూడదని వీళ్లంతట వీళ్లే అడ్డుకుని.. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ ను రాకుండా చేశారు. ఆ తర్వాత అవ్వాతాతలు పడిన అవస్ధలు చూసి, అవ్వాతాతలు చంద్రబాబునాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ పోతే.. మళ్లీ ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేసే భయంకరమైన అబద్దాలు ఈ రోజు చూస్తున్నాం.
ఇదే మాదిరిగా ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తున్నారు. మీ ఇంటికి పోన్లు కూడా చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా పోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని ప్రచారం చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబూ నువ్వసలు మనిషివేనా? అని అడుగుతున్నాను. మీ జగన్.. మీ బిడ్డ భూములిచ్చేవాడే కానీ, భూములు లాక్కునే వాడు కాదు. అసలు చంద్రబాబునాయుడిని అడుగుతున్నాను.. అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అంటే తెలుసా? ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అంటే దాని అర్ధం ఏమిటంటే భూములు మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేలలా ఉండేటట్టుగా ఒక యాక్టు చేయడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. ఫస్టు అది తెలుసుకో చంద్రబాబూ. ఇవాళ ఈ పెద్దమనిషి చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి కాబట్టి.. మీ అందరితో రెండు నిమిషాలు దాని గురించి చెబుతాను.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఏ భూమి ఎక్కడ కొనాలన్నా…ఆ భూముల్లో వివాదాలున్నాయి. ఆ భూముల్లో ఎక్స్ టెంట్ అన్నా తక్కువ ఉంటుంది. సబ్ డివిజన్ జరగకపోవడమో, సర్వే జరగకపోవడమే, రికార్డులు అప్ డేట్ కాకపోవడమో జరిగి ఉంటుంది. వీటన్నింటి వల్లా భూవివాదాలు పెరిగి రైతన్నలు, ప్రజలు అందరూ కోర్టులు, అధికారులు చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతుంది.
మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకున్న సంస్కరణ ఏమిటంటే.. ఏ రైతన్న, ఏ ఒక్కరూ కూడా వాళ్ల భూములు కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. వివాదాలకు సంబంధించి ఏ కోర్టుకూ వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్లకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ.. ఆ భూముల మీద ఏదన్నా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంటు గ్యారంటీ ఇస్తూ.. ఈ భూముల మీద వివాదం లేదు అని గ్యారంటీ ఇస్తూ చెప్పే ఒక సంస్కరణ తీసుకురావాలని మీ బిడ్డ ఆలోచన. ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే.. ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదం కూడా ఉండకుండా చూడడంతో పాటు, టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి, ఎటువంటి వివాదం కూడా లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలంటే.. మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వే పూర్తి కావాలి.
అప్పుడెప్పుడో బ్రిటీషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకునివచ్చి అందులో 15వేల మంది సర్వేయర్లుని కూడా పెట్టాం. వందసంవత్సరాల కిందట సర్వే జరగ్గా.. రైతుల కోసం మరలా ఈ రోజు మీ బిడ్డ ప్రతి ఎకరాను సర్వే చేయిస్తున్నాడు. సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తున్నాడు. రికార్డులన్నీ అప్ డేట్ చేయిస్తున్నాడు. సబ్ డివిజన్ చేయిస్తున్నాడు. చేసి ఆ రైతున్నలకే హక్కు పత్రాలను ఎక్కడికీ పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టు చేస్తున్నాడు. ఇవన్నీ పూర్తైన తర్వాత.. రాష్ట్రంలో 17వేలకు పైగా రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటివరకు 6వేల రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా ఒకటిన్నర, రెండు సంవత్సరాలలో పూర్తిగా 17వేల గ్రామాలలో సర్వే పూర్తవుతుంది.
ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గరా వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది. సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి. రికార్డులన్నీ అప్ డేట్ అయిన భూములు ఉంటాయి. సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ పేదలు, ఆ రైతన్నల దగ్గర ఉంటాయి. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
తీసుకుని వచ్చి ఏ స్ధాయిలోకి తీసుకునిపోతామంటే.. ఆ భూములన్నింటికీ వివాదాలు ఏమన్నా వస్తే.. ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి, తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుతున్నాను. చంద్రబాబు చెప్పే అబద్దాలను, మోసాలను ఏ ఒక్కరూ నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ ప్రార్ధిస్తున్నాను.
అదే మాదిరిగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా ఇదేరకమైన అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు ఈ సందర్బంగా నీకే చెబుతున్నాను. ఇప్పటివరకు ఏకంగా 9లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కార్డ్ టూ సాఫ్ట్ వేర్ తీసుకుని వచ్చి దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ సాప్ట్ వేర్ ద్వారా 9 లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా… ఆ తర్వాత డాక్యుమెంట్లు అన్నీ కూడా ఈ భూహక్కు యజమానులకే ఇవ్వడం జరిగింది. దీన్ని మరింత సునాయాసం చేస్తూ… ఏ ఒక్కరికీ ఏ సమస్య ఉండకూడదని, ఆ పత్రాలు రాసుకునేటప్పుడు వాటిలో తప్పులు ఉండకూడదని ఏకంగా పత్రాలకు సంబంధించిన ఫార్మాట్ కూడా ఆన్ లైన్ లో అవైలబుల్ చేస్తూ… ఏ ఒక్కరైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ ను డౌన్లోడ్ చేసుకుని.. వాళ్లే ఆ ఫార్మాట్ లో వివరాలన్నీ నింపి.. వాళ్లే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి ఆ డాక్యుమెంట్లు అన్నీ తీసుకుని వెళ్లి.. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేలిముద్రలు మిగిలిన కార్యక్రమమంతా పూర్తి చేసుకుని.. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఆ తర్వాత ఆ ఫిజికల్ డాక్యుమెంట్లు రైతులకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది తెలుసుకో చంద్రబాబూ.
ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఇవాళ రాజకీయ వ్యవస్ధ చెడిపోయింది. ఏకంగా ఇళ్లకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు, అబద్దాలు చెబుతున్నారు .ఇంతటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి మిమ్నల్ని అందిరినీ నేను కోరేది ఒక్కటే. వీళ్లు చెబుతున్న అబద్దాలు నమ్మకండి. వీళ్లు చేస్తున్న మోసాలు నమ్మకండి. మీ అందరికీ నేను ఒక్కటే చెబుతున్నాను. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీ అందరికీ మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకొండి. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవండి అని మాత్రం మీ అందరితో కోరుతున్నాను. ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే మీ అందరికీ చెబుతున్నాను అని తెలియజేస్తూ… మీ చల్లని దీవెనలకు, ఆశీస్సులకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.