ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అనేది వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుండి ఎల్లో మీడియా విపరీతంగా చేస్తున్న ప్రచారం. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదా? లేక ఎల్లోమాఫియా మాయలో సగటు మానవుడు చిక్కుకున్నాడా? అసలు అభివృద్ధి అనే పదానికి కొలమానం ఏంటి? ఏ ప్రాతిపదికన అభివృద్ధి అనేదాన్ని నిర్ణయిస్తారు?
వివరాల్లోకి వెళితే మనం ఎప్పుడైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఒకసారి అలా ఊరిలోకి వెళ్లి చూస్తే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, కమ్యూనిటీ హాల్, నాడు – నేడు కింద మౌలిక సదుపాయాలు మెరుగైన మీ ఊరి ప్రభుత్వ పాఠశాల, మీ ఊర్లో పేదలు, ఇల్లు లేనివారికి ఇచ్చిన ఇంటి 1.5సెంట్/ 1సెంట్ స్థలం, కట్టిన ఇళ్ళు ఇవన్నీ మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. వీటన్నిటితోపాటు ప్రభుత్వ బడికి వెళ్ళే విద్యార్థుల యూనిఫాం చూడండి, వాళ్ళ స్కూల్ బ్యాగ్, షూ చూడండి. వీలైతే మధ్యాహ్నం పూట మీకు దగ్గర్లోని ప్రభుత్వ స్కూల్ కి వెళ్ళి మధ్యాహ్న భోజనం పథకం లో భాగంగా జగనన్న గోరుముద్ద ద్వారా ఇస్తున్న పౌష్టిక ఆహారం మెనూ, ఆ రుచి కూడా చూడండి.
అలాగే ఆ బడి పిల్లల పాఠ్య పుస్తకాలు తెరిచి చూడండి. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయిరా అని విద్యార్థులను అడిగి తెలుసుకోండి.మీ ఊర్లోనే అవ్వతాతలను పలకరించి గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే పరిపాలన ఇప్పుడు ఎలా ఉంది అని ఒక్కసారి వాళ్ళని కదిలించండి. అలాగే ఈ సంవత్సరం 10, ఇంటర్ పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్లేందుకు నేటివ్, కుల ధ్రువీకరణ, EBC సర్టిఫికేట్, ఇన్కం సర్టిఫికేట్ కోసం వెళ్లే విద్యార్థులను సారీ పలకరించి ఇవన్నీ మీకు రావడానికి ఎంత టైం పట్టింది ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు ఎంత ఖర్చయింది ఇలాంటి వివరాలు అడిగి తెలుసుకోండి.
పొద్దున్నే పొలానికి వెళ్లే రైతన్నను పిలిచి అడగండి. ఎరువులు ఎక్కడ నుండి తెస్తున్నారు, పంట బీమా ఎక్కడ చేయిస్తున్నారు, ఇప్పుడు సబ్సిడీ ఏమైనా వస్తుందా లేదా వరదల సమయంలో తీవ్రంగా పంట నష్టపోయినప్పుడు పరిహారం అందుతుందా లేదా అని ఒక్కసారి రైతన్నను పలకరించండి. అలాగే వచ్చేటప్పుడు మీ ఊర్లో అంగన్వాడి సెంటర్ కి వెళ్ళి ఒక్కొక్కటి తరచి చూడండి. ఇవన్నీ అభివృద్ధి కాదా… అసలు అభివృద్ధి అంటే ఏంటి నిన్నటి కంటే ఈరోజు బాగోవడం అభివృద్ధి ఈరోజు కంటే రేపు బాగోటం అభివృద్ధి.. గతంలో వచ్చిన ప్రభుత్వాలు పాలకులతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో ఊరు రూపు లెక్కలు మారాయి. సగటు సామాన్య మానవుడికి అవసరమైన అన్ని వసతులు అవసరాలు సౌకర్యాలు మన కళ్ళ ముందుకే వచ్చాయి. ఒకసారి ఇవన్నీ నేరుగా చూసి తెలుసుకుంటే అభివృద్ధి అభివృద్ధి అనే దానిమీద ఉన్న అవగాహన రాహిత్యపుపొరలన్నీ తొలగిపోతాయి. అసలు సిసలైన అభివృద్ధికి ఆనవాళ్లు ఎదురవుతాయి.