ఈనెల 13వ తేదీన ముగిసిన ఎన్నికల అనంతరం చంద్రబాబు కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్న ప్రకారమే సతీ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. అయితే ఎప్పుడు ఏ పర్యటన చేసిన అధికారికంగా వెల్లడించే టిడిపి వర్గాలు ఈ పర్యటనను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచటం సర్వత్ర చర్చనీయాంసంగా మారింది. రహస్యంగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని ఇప్పటికే ఆరాలు తీయడం మొదలైంది. అయితే చంద్రబాబు తాను వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళుతున్నట్లుగా లీకులు ఇచ్చారు. కానీ, తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం చంద్రబాబు అసలు అమెరికానే రాలేదని తేల్చి చెప్పడం గమనార్హం.
అయితే వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళుతున్నాను అంటూ లీగులు ఇచ్చిన చంద్రబాబు దంపతులు దుబాయ్ నుంచి ఇటలీ వెళ్లినట్లుగా ఇమిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. చంద్రబాబు దంపతులతో పాటు లోకేష్ దంపతులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నట్లుగా అందరూ భావిస్తున్నారు. గతంలోనూ ఇదే విధంగా విదేశాల నుంచే సెల్ కంపనీలకు అక్రమ నిధులు మళ్లించడంలో చంద్రబాబు తన చాణిక్యతను చూపించిన సంగతి తెలిసిందే.. స్కిల్ స్కాం లోనూ బాబు – దుబాయ్ బంధాన్ని బలపరుస్తూ ఆధారాలు బయటపడిన పరిస్థితుల్లో ఈసారి కూడా ఈ పర్యటన వెనకాల రహస్యం షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల మళ్ళింపు దందాయే అయి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గతంలో చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న స్కిల్ స్కామ్‌లో కూడా ఈ విధంగానే నిధులను అక్రమంగా దుబాయ్‌కు చేర్చారు. ఆ కుంభకోణంలో పాత్రధారులైన బాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి, మనోజ్ పార్థసాని, కిలారి రాజేశ్ చౌదరి దుబాయ్ నుంచే అక్రమ నిధులను సింగపూర్ మీదుగా హైదరాబాద్‌లోని షెల్ కంపెనీకి తరలించారు. అనంతరం ఆ నిధులు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. అంటే ఆయన ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్ కీలక కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ రహస్య పర్యటన వెనుక అసలు గుట్టు కూడా అదే అయ్యుంటుందని తెలుస్తోంది.