టిడిపి దౌర్జన్యానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. టిడిపికార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి నాలుగు రోజులుగా మృత్యువు తో పోరాడి మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏజెంట్ గా ఉండటమే అతని తండ్రి పాలిట శాపమయింది. అచ్చం నాయుడు అనుచరుల ఆగడాలకు ఒక కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. వివరాల్లోకి వెళితే…. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్న వెంకటాపురంలో టిడిపి మూకల అరాచకానికి పోలింగ్ ఏజెంట్గా ఉన్న మాధవరావు తండ్రి మల్లేష్ ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.
చిన్న వెంకటాపురం పోలింగ్ బూత్ లో తోట మాధవరావు అనే వైఎస్ఆర్సిపి సానుభూతిపరుడు ఏజెంట్ గా ఉండడంతో కక్షిపించుకున్న టిడిపి కార్యకర్తలు అతని తండ్రి మల్లేష్ పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ నాలుగు రోజులుగా విశాఖపట్నం లోని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అచ్చం నాయుడు ఆయన సోదరుడు హరి వరప్రసాద్ డైరెక్షన్లోనే ఈనెల 16వ తేదీన గ్రామ దేవత పండగను ఆసరా చేసుకుని దాడికి తెగబడినట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు 40 ఏళ్లుగా నిమ్మడ పంచాయతీలో శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని, ఈసారి రెగ్గింగ్ కి ఎలాంటి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య ఎన్నికలు నిర్వహించడంతో ఓటమి భయంతోనే అచ్చం నాయుడు ఈ ఘాతుకానికి తలపడ్డాడు అంటున్నారు స్థానికులు. మృతుని కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేరాది తిలక్ హామీ ఇచ్చారు. అయితే ఈ పంచాయతీ ప్రస్తుత టిడిపి అధ్యక్షుడు గింజరుపాచం నాయుడు స్వస్థలం కావడం విశేషం.