వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయిన ఎమ్ఆర్సీ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ పార్టీలో క్రీయాశీలకనేతగా ఉన్న ఆయనపై పార్టీ అధ్యక్షులవారి ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తునట్టు వైసీపీకేంద్ర కార్యాలయం నుండి లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం పార్టీ ఈ నిర్ణయం తీసుకునట్టు అందులో వివరించారు.
వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిగారికి గతంలో సన్నిహితంగా ఉండే ఎమ్ఆర్సీ రెడ్డి పై క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్ఆర్సి రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా కూడా పనిచేశారని తెలుస్తుంది . అయితే చంద్రగిరిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్ఆర్సీ రెడ్డి పై సస్పెన్షన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎమ్ఆర్సి రెడ్డి గతంలో గల్లా అరుణ కుమారిగారికి శిష్యుడుగా ఉన్నారు.