నేడు ఐపీఎల్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటల నుంచి తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది ఈ సీజన్ లో లీగ్ దశ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇప్పుడు అసలైన సమరం ఆరంభం కానుంది.హైదరాబాద్, కోల్కత్తా రెండు జట్లు కూడా అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉన్నాయి
లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లలో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు,తొమ్మిది మ్యాచ్ లలో విజయం సాధించగా మూడు మ్యాచ్ లలో ఓటమి పాలైంది మరో రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే సన్రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్ లలో ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించి.. ఐదు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
ఈ ఫలితాలను బట్టిచూస్తే లీగ్ దశలో కోల్ కతా జట్టు హైదరాబాద్ జట్టుకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్, కోల్ కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్లేఆఫ్స్ దశలో కోల్ కతా జట్టు ఎనిమిది సార్లు విజయం సాధించగా.. ఐదు సార్లు ఓడిపోయింది. అదే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ దశలో ఐదు సార్లు గెలిచి.. ఆరు సార్లు ఓడిపోయింది.
ఈరోజు జరిగే ప్లేఆఫ్ మ్యాచ్ లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ లో అడుగుపెడుతుంది, ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో తలపడాల్సి ఉంటుంది.
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
కోల్కతా నైట్ రైడర్స్ :
శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, నితీష్ రాణా, ఫిల్ సాల్ట్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ, రింకు సింగ్ , ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా
సన్రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్