కొవ్వూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) గారు కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. 1983లో కాంగ్రెస్పార్టీ ద్వారా శాసన సభ్యునిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1985 ఎన్నికల్లో కొవ్వ్యురు నియోజకవర్గం నుండి టీడీపీ తరుపున పోటీచేసి గెలుపోందారు. అప్పటి నుండి 1999 మినహా 2004 వరకు కొవ్వురుకు శాసన సభ్యునిగా గెలిచి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ పాదయాత్ర గాలిలో సైతం టీడీపీకి తీవ్ర వ్యతిరేకత ఉన్నా కొవ్వూరులో ఆయన గెలిచి తన వ్యక్తిగత ప్రతిష్టను చాటుకున్నారు. 2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తదనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ తన రాజకీయ వారసునిగా ఆయన అల్లుడు ఎస్.రాజీవ్కృష్ణను ప్రోత్సహించారు. పెండ్యాల వెంకట కృష్ణారావు గారి మరణం నియొజకవర్గ ప్రజలకి తీరని లోటని శాసన సభ్యునిగా, పారిశ్రామికవేత్తగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు.