యూట్యూబ్ చానల్ లో కాంట్రవర్సీ వీడియోలు చేసుకుంటూ హైలెట్ అయిన సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ వ్యవహార శైలి మొదటి నుండి వివాదాస్పదమే . సమాజం lలో వర్గాల మధ్య, మతాల మధ్య ఉన్న పొరపొచ్చాలనే ఆయుధంగా మార్చుకుని విద్వేషాలు రగిల్చేలా తీవ్ర వాఖ్యలు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్న రాజేష్ కొద్దిరోజుల తరువాత పంధా మార్చి రాజకీయ నాయకులపై ఆయా పార్టీ కార్యకర్తలపై వివాదాస్పద వాఖ్యలు చేసుకుంటూ వచ్చిన విషయం అందరికి తెలిసిందే . తొలుత […]
పి.గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్‌ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తప్పించారు. లేదు ఒత్తిళ్లకు తలొగ్గి తనకై తాను తప్పుకొన్నాడని ఎల్లో మీడియా రాసుకొచ్చింది. కానీ బుధవారం ఈనాడులో వచ్చిన వార్తను చూసి తెలుగు తమ్ముళ్లు జట్టు పీక్కుంటున్నారు. పి.గన్నవరం టీడీపీ అభ్యర్థిగా రాజేష్‌ను చంద్రబాబు ప్రకటించారు. ఇతను అత్యంత వివాదాస్పదుడిగా పేరుగాంచాడు. దీంతో అక్కడి తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు, బ్రాహ్మణ సంఘాల సభ్యులు తదితరులు భగ్గుమన్నారు. వ్యతిరేకత రావడంతో చంద్రబాబు ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నిండా ముంచేశాడని మహాసేన రాజేష్ తీవ్ర అంతర్మథనంలో ఉన్నారు. భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సరైన దారి కోసం వెతుక్కుంటున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పి.గన్నవరం టీడీపీ – జనసేన అభ్యర్థిగా అత్యంత వివాదాస్పదుడైన రాజేష్‌ను ప్రకటించారు. దీంతో ఆ రెండు పార్టీల నేతలు భగ్గుమన్నారు. అతడిని బరి నుంచి తప్పించాలని జనసైనికులు టీడీపీ పార్లమెంటరీ ఇన్చార్జి హరీష్ మాధుర్ కారును ధ్వంసం చేశారు. […]
కులం పేరు చెప్పుకుని చందాలు వసూలు చేసుకుని లగ్జరీ గా బతికే సరిపెళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ కి అనూహ్యంగా పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ టీడీపీ ప్రకటించడం ఒకింత ఆశ్చర్యం. ఎంత కాదనుకున్నా టీడీపీ కి జనసేన కి ఇద్దరికీ కాస్త చెప్పుకోదగ్గ బలం ఉన్న నియోజకవర్గమే అది, 2009 లో కాంగ్రెస్, 2014 లో టీడీపీ, 2019 లో వైసీపీ గెలిచిన సీట్ అది. అలాంటి చోట రాజేష్ కి టికెట్ ఇవ్వడం […]
నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందన్న చందాన అగ్ర కులాల అమ్మాయిలను లే*కు రండి నేను పారితోషికం ఇస్తాను, ఫలానా కులం వాళ్లంతా దోపిడీ పరులే అంటూ రాయలేని భాషలో తన యూట్యూబ్ ఛానెల్ లో ఒకప్పుడు నోటికి వచ్చింది మాట్లాడిన మహాసేన రాజేష్ ఇప్పుడు కొత్తగా సింపతీ డ్రామాకి తెరలేపారు. తన వల్ల పార్టీకి అధినేతకు నష్టం కలుగుతుందంటే తాను పోటీ నుండి తప్పుకోవడానికి కూడా సిద్దమే అంటూ చిలక పలుకులు పలుకుతుండడం చూసి ప్రజలు […]
మాట్లిడితే వైసీపీ నాయకులకు బూతులు తప్ప మరేమీ రావనీ, ప్రతిపక్షాన్ని ఎంత బూతులతో తిడితే అంతగా జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటారని పదే పదే టీవీలలో ఏడుస్తూ, కళ్ళొత్తుకునే టీడీపీ నాయకులకి వాళ్ళు అధినేత బూతులు మాట్లాడే పైకొచ్చిన మనిషికి టికెట్ ఇచ్చినపుడు మాత్రం కళ్ళకి అడ్డంగా పచ్చ కొవ్వు పేరుకిపోయి ఏమీ కనబడనట్టు నటిస్తారు. సరిపల్లి రాజెష్ అలియాస్ మహాసేన రాజేష్ అనే వ్యక్తికి ఏ అర్హత చూసి చంద్రబాబు టికెట్ ఇచ్చారు ?? బూతులు తిట్టడమే […]
తెలుగుదేశం పార్టీ తరుపున అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా నిలబడిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు సరిపెల్ల రాజేష్ పై రోజు రోజుకు వివాదం ముదురుతుంది. ఇప్పటికే తన అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ,జనసేన నేతలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో తల పట్టుకుంటున్న టీడీపీ అధిష్టానానికి ఇప్పుడూ బ్రాహ్మణ సంఘాలు సైతం షాక్ ఇస్తున్నాయి. మహాసేన అనే సంస్థని ఏర్పాటు చేసుకున్న సరిపెల్ల రాజేష్ నిత్యం బ్రాహ్మణ సామాజిక వర్గంపై, హిందువులపై […]
చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడు చేయనంత కసరత్తు చేసి ప్రకటిస్తున్నానని చెప్పి మరీ ప్రకటించిన టీడీపీ అభ్యర్ధుల జాబితా చివరికి ఆయనకే తల పోటుగా మారుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్ధమవుతుంది. అటు ఉత్తరాంద్ర నుండి ఇటూ రాయలసీమ వరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. మరీ ముఖ్యంగా పి.గన్నవరంలో మహాసేన యూట్యూబ్ చానల్ ఓనర్ గా చెప్పుకునే రాజేష్ కి సీటు కేటాయించడాన్ని అటూ జనసేనతో పాటు ఇటూ […]
పి. గన్నవరం అసెంబ్లీ సీటును టీడీపీ అధినేత చంద్రబాబు మహాసేన రాజేష్ కు కేటాయించడం ఇప్పడు ఆ నియోజకవర్గంలో మాదిగల తిరుగుబాటుకు కారణమైంది. టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో చోటు దక్కించుకోలేని ఆశావహులు ఇప్పటికే తమ నిరసన గళాలను వినిపిస్తుండగా ఎవరూ ఊహించని రీతిలో రాజేష్ మహాసేనకు పి.గన్నవరం టికెట్ కేటాయించడంతో అక్కడ దళితుల తిరుగుబాటుకు కారణమైంది. టీడీపీ ఆవిర్భావం నాటి నుండి టీడీపీ వెంట నడిచిన మాదిగలను చంద్రబాబు మోసం చేసారని […]