పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ గా శ్రీకేష్ లత్కర్ బాలాజీ నియమితులయ్యారు. 2011 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన లత్కర్ గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ సంస్థకు, అగ్రికల్చరల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా పనిచేస్తుండగా బదిలీపై పల్నాడు జిల్లాకు రానున్నారు.
అలాగే పల్నాడు జిల్లాలో ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మకమైన ఘటనలు ఆధారంగా జిల్లా ఎస్పీ అయిన బిందుమాదవ్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లికా కార్గ్ ను నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు నూతన ఎస్పీగా మల్లిక కార్గ్ నేటి ఉదయం నుండి బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తుంది. ఎస్పీ మల్లికా కార్గ్ గతంలో కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీగా ప్రకాశం జిల్లా ఎస్పీగా రెండు సంవత్సరాలు విధులు నిర్వహించారు.