తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నిండా ముంచేశాడని మహాసేన రాజేష్ తీవ్ర అంతర్మథనంలో ఉన్నారు. భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సరైన దారి కోసం వెతుక్కుంటున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పి.గన్నవరం టీడీపీ – జనసేన అభ్యర్థిగా అత్యంత వివాదాస్పదుడైన రాజేష్‌ను ప్రకటించారు. దీంతో ఆ రెండు పార్టీల నేతలు భగ్గుమన్నారు. అతడిని బరి నుంచి తప్పించాలని జనసైనికులు టీడీపీ పార్లమెంటరీ ఇన్చార్జి హరీష్ మాధుర్ కారును ధ్వంసం చేశారు. హిందూ దేవుళ్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ బ్రహ్మణ సంఘం నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు ఆందోళనకు గురయ్యారు. రాజేష్‌పై ఒత్తిడి తెచ్చి పోటీ చేయనని చెప్పించారు.
ఇప్పుడు రాజేష్ ఎటూ కాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. రాజకీయ జీవితం ప్రశ్నార్థకరంగా మారింది. దీంతో మనుగడ కోసం విశ్రాంత ఐఏఎస్ విజయకుమార్ పెట్టిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకేశ్ బుజ్జగింపులకు తెరతీశారని సమాచారం. ఎన్నికల సమయంలో ఎవరైనా పార్టీ వీడితే జనంలో చర్చ జరుగుతుందని భావించి టీడీపీని వీడొద్దని, భవిష్యత్‌లో ఎమ్మెల్సీ ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తనను బరిలో నుంచి తప్పించడంతో రాజేష్.. చంద్రబాబు, లోకేశ్‌పై ఆగ్రహంగా ఉన్నారు. వారిని మళ్లీ నమ్మి మోసపోవడం కంటే పార్టీ వీడడమే బెటరనే నిర్ణయానికి వచ్చారు.
గతంలో రాజేష్ కొంతకాలం జనసేనకు బయటి నుంచి మద్దతు ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను ఒక రేంజ్లో పొగడడంతో జనసైనికులు ఇతడిని నెత్తిన పెట్టుకున్నారు. పవనే స్వయంగా తనకి ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించారని డప్పు కొట్టుకుని హంగామా చేశారు. కానీ చివరికి టీడీపీలో చేరారు. దీంతో సేన నేతలు అతడిని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాజేష్, ఆయన మనుషులు వెనక్కి తగ్గకుండా పవన్ అభిమానగణంపై విరుచుకుపడ్డారు. ఈ తంతు కొంతకాలం నడిచింది. అతను జగన్‌ను విపరీతంగా తిడుతుండడంతో చంద్రబాబు బాగా ఎంకరేజ్ చేశారు.
తనకు టికెట్ ఇస్తే జనసైనికులు రచ్చరచ్చ చేశారని రాజేష్ భావిస్తున్నారు. అప్పుడు పవన్ వెంట నడిచి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదనలో ఉన్నారు. ఎన్నికల సమయంలో జనసేనలో చేరితే.. గత అనుభవాల దృష్ట్యా అక్కడిన నేతలు ఒప్పుకోరని, పైగా విశ్వసనీయత లేని వ్యక్తిగా మిగిలిపోతానని భయపడ్డారు. ఇప్పటికే టీడీపీలో చేరి తప్పు చేశానని, అక్కడే ఉంటే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజేష్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నోటి అదుపులో పెట్టుకుని.. మంచి నాయకుడిని నమ్ముకుని ఉంటే నేడు ఈ పరిణామాలు ఎదురయ్యేవి కాదుగా..