కులం పేరు చెప్పుకుని చందాలు వసూలు చేసుకుని లగ్జరీ గా బతికే సరిపెళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ కి అనూహ్యంగా పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ టీడీపీ ప్రకటించడం ఒకింత ఆశ్చర్యం. ఎంత కాదనుకున్నా టీడీపీ కి జనసేన కి ఇద్దరికీ కాస్త చెప్పుకోదగ్గ బలం ఉన్న నియోజకవర్గమే అది, 2009 లో కాంగ్రెస్, 2014 లో టీడీపీ, 2019 లో వైసీపీ గెలిచిన సీట్ అది. అలాంటి చోట రాజేష్ కి టికెట్ ఇవ్వడం అంటే ఆశ్చర్యమనే చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పి గన్నవరం లో రాజేష్ లాంటి వ్యక్తి పోటీ చేస్తే వైసీపీ గెలుపు అత్యంత సులువు.
ఇది ముందుగానే అర్థమయ్యే విషయమే, కానీ రాజేష్ కి ఈ టికెట్ కేటాయించడం లో బాబు ఆంతర్యం ఏమిటో గానీ, ఇప్పుడు మళ్లీ బాబు మనసు మార్చుకున్నట్లుగా ఉంది. అందుకే టికెట్ లేదని బాహాటంగా చెప్పకపోయినా, రాజేష్ కు సమాచారం వెళ్లిపోయింది. గత వారం రోజుల్లో నియోజకవర్గంలో పర్యటనల ద్వారా జనసేన కార్యకర్తల నిరసన, టీడీపీ కార్యకర్తల సహకారం లేకపోవడం, హిందూ దేవుళ్లని తిట్టి, హిందువులుగా ఉన్న దళితులను కూడా తిట్టి, అంబేద్కర్ రాజ్యాంగానికి కాలం చెల్లిందని పిచ్చి వాగుడు వాగి దళితుల దగ్గర కూడా చెడ్డ పేరు పొందిన రాజేష్ కి ఈ వర్గం నుండి సహకారం లేకపోవడంతో టికెట్ ఇచ్చే విషయం పై బాబు, లోకేష్ లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది..
అయినా తనకు కావాల్సింది తను చేసుకుపోయాడు, ఈ వారం రోజుల్లోనే 5-6 కోట్ల కలెక్షన్లు వసూలు చేసుకోడంలో సఫలం అయ్యాడట..