రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతుంది. రాష్ట్రంలో అనేకమంది ప్రజలు తిరిగి జగన్ ప్రభుత్వమే మళ్ళీ అధికారం ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తుంటే ఒక వర్గం మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాదిస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా కోట్లల్లో బెట్టింగ్ కూడా సాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికలు ముగిసే సమయానికి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎల్లో మీడియా కుటమి అధికారంలోకి వస్తుందని ప్రచారం మొదలు పెట్టడంతో తెలుగుదేశం గెలుస్తుందని భారీగా బెట్టింగులు కాసిన వారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.
ఎన్నికల్లో వ్యూహ ప్రతివ్యూహ రచనకు రాష్ట్రంలో ఇరు ప్రధాన పార్టీలు వ్యూహకర్తలను నియమించుకున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీకి 2017 నుంచే ఐప్యాక్ టీం ఉంది. తొలుత ఇది 2019 వరకు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఉండగా 2019 ఎన్నికల అనంతరం ఆయన ఐప్యాక్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ టీం కు సారధిగా రిషి సింగ్ ఉన్నారు. అయితే 2019 వరకు తెలుగుదేశానికి ఎలాంటి వ్యూహకర్తలు లేరనే చెప్పాలి. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రాబిన్ శర్మ ని వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఈ రాబిన్ శర్మనే నారా లోకేష్ యువగళం, బాదుడే బాదుడు, లాంటి అనే ప్రభుత్వ వ్యతిరేక క్యాంపైన్లు నడిపారు.
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల తరువాత రాబిన్ శర్మ చంద్రబాబుకి షాక్ ఇచ్చేలా ఇక రిపోర్ట్ ఇచ్చారనే వాదన ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. ఒక పక్క 2024 ఎన్నికల అనంతరం ఐప్యాక్ టీం ని జగన్ బహిరంగంగానే కలిసి అభినందించారు. అదే సమావేశంలో జగన్ 2019 కన్నా మెరుగైన ఫలితాలు సాధించబోతునట్టు చెప్పారు. అయితే టీడీపి అధినేత చంద్రబాబు కానీ లోకేష్ కానీ రాబిన్ శర్మని కలిసినట్టు ఎక్కడా లేదు దీనికి కారణం ఎన్నికల వ్యూహ రచనల్లో రాబిన్ శర్మ ఫేయిల్ అయ్యాడనే అభిప్రాయం టీడీపీ అధినాయకత్వంలో ఉందని చెబుతున్నారు. దీనికి తోడు ఎన్నికల్లో టీడీపీ మరోసారి ఓటమి మూటకట్టుకుంటుందని రాబిన్ శర్మ రిపొర్ట్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డారనే వాదన ఉంది. ఏది ఏమైనా ఓటరు ఏవరికి అధికారం కట్తబెట్టబోతున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.