ఏపిలో నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కమీషన్ కు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ సంచలనం సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన వివరాలు రాజకీయ వర్గాల్లో టీడీపీ,జన సేన పొత్తు మీద జరిగిన ఎన్నో విషయాలను పటాపంచలు చేసిందని తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ అత్యుత్సాహంగా స్పందించడం మనకందరికీ తెలుసు. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగాయి అందుకే పవన్ […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఈ సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల నుంచి పలువురు కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ […]
‘జగన్ హయాంలో ఏపీ నాశనమైపోయింది. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ధ్వంసమైపోయిన రాష్ట్రాన్ని నేను మాత్రమే బాగు చేయగలను’ ఎన్నికల సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలివి. ఎల్లో గ్యాంగ్ దీనిని పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవాలు వేరు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కొత్త వాటికి భూమి పూజ జరిగింది. పెట్టుబడుల విషయంలో జగన్మోహన్రెడ్డి ఏనాడూ చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదు. పచ్చ గ్యాంగ్ కళ్లు తెరిచి చూస్తే […]
‘అనాకపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ చాలా మంచి వాడు. నాకు అత్యంత ఆప్తుడు. కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈయన్ను గెలిపించండి’ ఇటీవల సిటీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్న మాటలివి. సారా వ్యాపారి అయిన చింతకుంట మునెయ్యగారి రమేష్ నాయుడు అలియాస్ సీఎం రమేష్ ప్యాకేజీ ఇచ్చి మరీ చిరు చేత పొగిడించుకున్నాడు. చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్ చరిత్ర చూస్తే ఇలాంటి వ్యక్తా అనిపించకమానదు. అతడి […]
ఎన్నికలు వచ్చాయంటే చంద్రబాబు తన దగ్గర ఉన్న దొంగ హామీల మంత్ర దండం బయటికి తీస్తాడు. నోటికి వచ్చిన హామీలని బిగ్గరగా అరిచి మరీ ఇస్తాడు. తన రాజకీయ జీవితం మొత్తంలో ఇచ్చిన ఏ హామీనీ సంపూర్ణంగా నేరవేర్చిన చరిత్రే లేని చంద్రబాబు, ప్రతీ ఎన్నికలకు ఓట్లు దండుకునేందుకు అస్త్రంగా మాత్రమే మేనిఫెస్టోని చూస్తాడు. 1995లో పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావు గారినే గద్దె దింపి ఆ సీటు మీద కూర్చున్న చంద్రబాబు నాటి నుండి […]
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండడంతో పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కాగా మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా చెల్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. విజయనగరం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఓ మహాసముద్రం కనిపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్రపాపారాయుళ్లు […]
ఎన్నికల వేళ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇష్టానుసారంగా అధికార పార్టీని తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వ్యక్తిగత దూషణలు చేయకూడదు. కానీ నారా వారు ప్రతి సభలో ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎన్నికల కోడ్ మొదలయ్యాక ఇది మరీ ఎక్కువైంది. ప్రతి బహిరంగ సభలో […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీకి సంబంధించి నామినేషన్ ను రేపు దాఖలు చేయనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజుతో ముగియనుంది. చివరి మేమంతా సిద్ధం సభ ముగిసిన తర్వాత టెక్కలి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి గన్నవరంకి విమానంలో వస్తారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో బస చేసి రేపు ఉదయం 8.15 నిమిషాలకు గన్నవరం నుంచి కడప చేరుకుంటారు. కడప నుంచి […]
Sslc అనగా సెకండరి స్కూల్ లివింగ్ సర్టిఫికెట్,టెన్త్ పరీక్షలు అన్ని సబ్జెక్ట్ లలో పాస్ అయ్యిన వారికి ఇస్తారు. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఈ sslc విధానాన్ని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య గారి హయాంలో అనగా 80 అక్టోబర్ నుండి 82 పిబ్రవరి మద్య కాలంలో రద్దు చేసి ssc విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎడ్యుకేషన్ వద్దకు వద్దాం, నిన్న నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ అందులో […]
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సంక్షేమ పాలన అందించి పేదల పాలిట తన కమిట్మెంట్ ని నిరూపించుకున్న జగన్, రాజకీయ యవనిక పై తనకంటూ ఒక ముద్ర ఉండిపోయేలా చేసుకున్నారు. పోరాట యొధుడిగా, సంక్షేమ సారధిగా జగన్ పేదల మనసుల్లో గూడుకట్టుకున్నారనేది కాదనలేని సత్యం. 5ఏళ్ళు పాలించడానికి ప్రజలు తీర్పు ఇస్తే 2ఏళ్ళు కరోనాతో పోయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా సంక్షేమం అందించి ప్రజలని ఆదుకున్న తీరు దేశ వ్యాప్తంగా […]