జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తనకు ప్రాణహానీ ఉంది పోలీసులు రక్షణ కల్పించాలని పోలీసులకి ఫిర్యాదు చేసాడు. గతంలో సీబిఐ జాయింట్ డైరెక్టర్ గా తాను పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేశానని ఇందులో భాగంగా కొందరు నుంచి తనకు ప్రాణ హాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ను కలిసి ఫిర్యాదును అందజేశారు. నేను సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని విచారించాను. ఆ సమయంలో ఆయనకు సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న నంబాల రాజేష్ కుమార్ ని కూడా విచారించడం జరిగిందని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి నంబాల రాజేష్ అనుచరులు కొంతమంది రెక్కీ చేశారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నంబాల రాజేష్ ప్రస్తుతం విశాఖ పట్టణంలో ఉన్నాడు ఆయన మీద నాకు అనుమానం ఉందంటూ ఫిర్యాదులు పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఆ నియోజకవర్గంలో నంబాల రాజేష్ తిరుగుతున్నాడు అని ఫిర్యాదులో రాశారు. పరిణామాలు చూస్తుంటే విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా జేడీ చేసిన ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కాగా వివి లక్ష్మీనారాయణ 2019లో తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయ ప్రవేశం చేశాడు. 2019 సార్వత్రిక ఎన్నికలలో విశాఖ పార్లమెంటు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఎన్నికల్లో ఓటమి చెందిన కొన్ని రోజులకే జనసేనను వీడి ఏ పార్టీలో చేరకుండా రాష్ట్రస్థాయి పర్యటనలు చేశాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడని మొదట ఊహాగానాలు వినిపించిన తర్వాత జై భారత్ పార్టీ పెట్టాడు. రానున్న ఎన్నికల్లో జై భారత్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు .