‘అనాకపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ చాలా మంచి వాడు. నాకు అత్యంత ఆప్తుడు. కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈయన్ను గెలిపించండి’ ఇటీవల సిటీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్న మాటలివి. సారా వ్యాపారి అయిన చింతకుంట మునెయ్యగారి రమేష్ నాయుడు అలియాస్ సీఎం రమేష్ ప్యాకేజీ ఇచ్చి మరీ చిరు చేత పొగిడించుకున్నాడు.
చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్ చరిత్ర చూస్తే ఇలాంటి వ్యక్తా అనిపించకమానదు. అతడి కుటుంబానిది సారా వ్యాపారం. కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు విస్తరించారు. ఆ సమయంలోనే బాబుతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1995 ఆయన సీఎం అయ్యాక రమేష్ దశ తిరిగింది. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి డబ్బు భారీగా ఇవ్వడంతో సీఎంకు రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం దక్కింది.
బాబు అండ చూసుకుని రమేష్ అనేక అరాచకాలు చేశాడు. గుడిమల్ల దేవాలయ భూములు 303 ఎకరాలను వేలంగా రమేష్ కుటుంబం దక్కించుకుందంటే అది బాబు వల్లే. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ను స్థాపించిన రమేష్ టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయల విలువైన పనులు దక్కించుకున్నాడు. ఈ సమయంలో నిబంధనలకు నీళ్లొదిలేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్, హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ – 2, హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు, వెలిగొండ టన్నెల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, వంశధార ప్రాజెక్టు పనులు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం తదితర రూ.3,658 కోట్ల విలువైన పనులు దక్కించుకుని అడ్డగోలుగా సంపాదించాడు. రమేష్ సోదరుడు సురేష్ నాయుడు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ కేంద్రంగా దోపిడీకి పాల్పడ్డాడు. ఇనుము, సిమెంట్, కంకర యథేచ్ఛగా తరలించి కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నాడు.
2019లో టీడీపీ ఓడిపోయాక చంద్రబాబు సూచనలతో రమేష్ బీజేపీలోకి వెళ్లాడు. తన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అనేక ప్రాజెక్టులు దక్కించుకున్నాడు. బాబు సూచనలతో ఈ కంపెనీ రూ.45 కోట్ల విలువైన కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే వాడుకోవచ్చనే ఆలోచన బాబు, రమేష్‌ది. వాస్తవానికి అనకాపల్లి సీటును అయ్యన్న పాత్రుడి తనయుడు, నాగబాబు తదితరులు ఆశించారు. కానీ నారా వారు తన సన్నిహితుడైన రమేష్‌కు ఇచ్చారు.
అటు సారా వ్యాపారం ద్వారా పేదల జీవితాలతో ఆడుకుని.. ఇటు చంద్రబాబు ద్వారా వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించిన వ్యక్తి చిరంజీవికి అత్యంత ఆప్తుడయ్యాడు. అవినీతి సొమ్ములో మెగా బ్రదర్‌కు ఎంత అందిందో కానీ రమేష్‌ను గెలిపించాలంటూ ఏకంగా వీడియో వదిలాడు. మేం నీతులు మాత్రం చెబుతాం. అవి మాకు వర్తించవనే చందాన చిరు ఉన్నాడు.