జగన్ పాలనపై సంక్షేమం ఫలాలపై వేలెత్తి చూపే ఆస్కారంలేని ప్రతిపక్షాలు నిత్యం ఆయనపై చేసే దాడుల్లో అతి ముఖ్యమైనది మతపరమైన దాడి. కుట్రలకి కుతంత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన తెలుగుదేశం పార్టీ ఏదొక సమస్యను సృష్టించి దాన్నే ఒక ఇష్యుగా లేవనెత్తి జగన్ కి అంటగట్టి రాజకీయం చేయడం పరిపటిగా మారింది. రెండు రోజులనాడు కూడా నెల్లిమర్లలో రామతీర్ధం రాములవారిపై దాడి అంటూ చంద్రబాబు చేసిన మతరాజకీయం విదితమే. అయితే ఇదే చంద్రబాబుకి దేవుని పై నిజంగా భక్తి ఉందా అంటే లేదనే చెప్పాలి దేవుడి పూజలు బూట్లు వేసుకుని చేసే చంద్రబాబులో దైవ భక్తి ఉంది అనుకోవడం పొరపాటే అవుతుంది.
జగన్ పై మత రాజకీయం చేసే వారికి చెంపపెట్టులా తాను హిందూ దేవాలయాల అభివృద్దికి గడచిన 5ఏళ్లలో ఏం చేసింది, రాబోయే 5 ఏళ్లల్లో ఏం చేయబోతుంది స్పష్టం చేస్తూ మ్యానిఫెస్టొలో పొందుపరిచారు. ఆ వివరాల్లోకి వెళితే, ఇప్పటి వరకు తన ప్రభుత్వం 1,376 కోట్లతో 1056 పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం చేశాం అని చెప్పారు. అలాగే 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా, అర్చకులకు రిటైర్మెంట్ విధానం రద్దు, అర్చకుల వేతనాల పెంపు అమలు చేశాం అన్నారు, అర్చకులకు జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేశాం అన్నారు.
అలాగే మేనిఫెస్టోలో చెప్పకపోయినా, బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు పెంచాం . 5,416 ఆలయాలకు నిత్య ధూప, దీప, నైవేద్యాలకు నిధులు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం కూల్చేసిన ఆలయాల పునర్నిర్మాణం చేశామనీ తెలిపారు . దేవాలయ బోర్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పించాం అన్నారు. విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో 216 కోట్లతో. శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయంలో 175 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం అన్నారు. 5,300 ఎకరాల భూవివాదాల పరిష్కారం చేశాం అని చెబుతూనే. వచ్చే 5 ఏళ్లలో దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తూనే మిగిలినవన్నీ కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.