‘నా ప్రభుత్వంలో రైతే రాజుగా ఉంటాడు. వ్యవసాయాన్ని పండగ చేస్తా’ 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటివి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. కొర్రీలు పెట్టి చంద్రబాబు నాయుడు వేధించాడు. జగన్ ప్రభుత్వం ఐళ్లలో రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చు చేసింది.
2019 మేనిఫెస్టోలో రైతు భరోసా ద్వారా రూ.50,000 ఇస్తామని జగన్ చెప్పారు. అంతకుమించి ప్రతి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు, అటవీ, దేవదాయ భూముల సాగుదారులకు భరోసా పథకాన్ని వర్తింపజేశారు. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలిచ్చారు. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచితంగా విద్యుత్ సరఫరా జరిగింది. వైఎస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు వేయించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ రద్దు చేశారు. ఆక్వా జోన్లో ఉన్న 10 ఎకరాల్లోపు రైతులకు కరెంట్ యూనిట్ రూ.1.50కే అందించారు. రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షలను వైఎస్సార్ బీమా ద్వారా ఇచ్చి ఆదుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, జిల్లా స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. సహకార రంగాన్ని పునరుద్ధరించారు. పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో పోటీ పెరిగి లీటరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పాడిరైతులు అదనంగా పొందేలా చేశారు. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా (11 నెలలకు మించకుండా) భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణ చేశారు. దేశంలో తొలిసారిగా కౌలు రైతులను గుర్తించేందుకు చట్టబద్ధమైన ప్రక్రియ తీసుకొచ్చారు. సులభతరమైన విధానంలో కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు (సీసీఆర్ సీ కార్డులు) గ్రామ సచివాలయాల్లోనే జారీ చేశారు. మొత్తంగా 8.31 లక్షల మందికి కార్డులు ఇచ్చారు. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకున్నాం.
మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలూ వారి ఊళ్లోనే అందించేందుకు 10,778 ఆర్బీకేలను ఏరాపటు చేశారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర సేవలు రైతు ముంగిటికే తెచ్చారు. 162 కొత్త అగ్రి టెస్టింగ్ ల్యాబుల ఏర్పాటు జరిగింది. ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ సీహెచ్‌సీ ద్వారా యంత్రాలు అందుబాటులో ఉంచారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. పశు బీమా పథకాన్ని అమలు చేశారు. సంచార పశు ఆరోగ్య సేవ నిమిత్తం 340 వాహనాలు సమకూర్చారు. చేపలు, రొయ్యల మార్కెటింగ్ కోసం 2,151 ఫిష్ ఆంధ్రా రిటైల్ దుకాణాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారు. దళారుల ప్రమేయం లేకుండా పొలం వద్దే ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ జరిగింది. ధాన్యం కొనుగోలులో జీఎల్టీ పేరిట ఎంఎస్పీతో కలిపి రైతులకు అదనంగా చెల్లించారు. వేరే రాష్ట్రాల్లో బోనస్ మాత్రమే ఇస్తారు. మన రాష్ట్రంలో అదనంగా ఏడాది పొడవునా జీఎల్టీ ఇచ్చారు. ఇలా ఇప్పటివరకు రూ.341 కోట్లు చెల్లించారు. దీని వల్ల ప్రతి రైతుకూ ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు అదనంగా.. ఎంఎస్సీ కన్నా ఎక్కువ ఇచ్చారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించిన పంటలకు కాకుండా మరో 6 పంటలకు కూడా మనం కనీస మద్దతు ధర ప్రకటించారు. శనగ, ఆయిల్ పామ్ రైతులను ఆదుకున్నారు. పొలంబడి ద్వారా మేలైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చారు. రైతులకు ప్రతిబంధకంగా ఉన్న అనేక భూ సమస్యలను పరిష్కరించారు. అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు, 22ఏలో ఉన్న ఇనామ్ భూముల తొలగింపు, భూములు లేని నిరుపేదలకు భూముల అసైన్మెంట్ చేయడం, లంక భూములు, చుక్కల భూములు, షరతులు గల పట్టాలు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు, గిరిజనులకు ఇచ్చిన డీకేటీ భూములు.. తదితర కార్యక్రమాల వల్ల 20.24 లక్షల మంది లబ్ధి పొందారు.
రైతు భరోసా కింద ఇప్పుడు ఏటా ఇస్తున్న రూ.13,500 ఇకపై రూ.16,000కు పెంపుదల చేయనున్నట్లు జగన్ ప్రకటించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.80 వేలు లబ్ధి చేకూర్చనున్నారు. గత ఐదేళ్లలో చూసుకుంటే 54 లక్షల మందికి లబ్ధి అందింది. వచ్చే ఐదేళ్లూ రైతు సంక్షేమం, అభివృద్ధి ఇలాగే కొనసాగిస్తామని జగన్ ప్రకటించారు.