‘జగన్ హయాంలో ఏపీ నాశనమైపోయింది. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ధ్వంసమైపోయిన రాష్ట్రాన్ని నేను మాత్రమే బాగు చేయగలను’ ఎన్నికల సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలివి. ఎల్లో గ్యాంగ్ దీనిని పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవాలు వేరు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కొత్త వాటికి భూమి పూజ జరిగింది.
పెట్టుబడుల విషయంలో జగన్మోహన్రెడ్డి ఏనాడూ చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదు. పచ్చ గ్యాంగ్ కళ్లు తెరిచి చూస్తే ఆయన పాలనలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో తెలుస్తుంది. కాస్టిక్ సోడా రంగంలో రూ.861 కోట్ల పెట్టుబడితో గ్రాసిం ఇండస్ట్రీస్ పరిశ్రమ ఏర్పాటైంది. దీని వల్ల 1,300 మందికి ఉపాధి లభించింది. కెమెరా మాడ్యూల్స్ రంగంలో సన్నీ ఒప్పొ టెక్ పరిశ్రమ రూ.280 కోట్లతో ఏర్పాటైంది. 1,200 మందికి ఉపాధి దక్కింది. సర్క్యూట్ బోర్డ్స్ రంగంలో ఫాక్స్‌లింక్ ఇండియా ఎలక్ట్రిక్ పరిశ్రమ రూ.2,000 కోట్లతో ఏర్పాటు కాగా 1,050 మంది ఉద్యోగాలు పొందారు. టీవీ డిస్ప్లే ప్యానల్స్ రంగంలో రూ.2,200 కోట్లతో ప్యానల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీస్ పరిశ్రమ ఏర్పాటుకాగా 2,200 మందికి ఉపాధి లభించింది. గార్మెంట్స్ రంగంలో రూ,110.38 కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పరిశ్రమ పెట్టారు. 2,112 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ప్లైవుడ్స్ ప్యానల్స్ రంగంలో రూ.1,600 కోట్లతో సెంచురీ ప్యానల్స్ పరిశ్రమ మొదలవగా 1,600 మందికి ఉపాధి దక్కింది. హాఫ్ హైవే టైర్స్ రంగంలో రూ.1,250 కోట్లతో ఏటీసీ టైర్స్ ఏర్పాటైంది. 1,250 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సిమెంట్ రంగంలో రూ.1,790 కోట్ల పెట్టుబడితో రాంకో సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేయగా 840 మందికి లభించింది.
పైవన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైనవే. ఐదు సంవత్సరాల్లో రూ.78,514 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కరోనా కష్టాలను అధిగమించి మరీ పరిశ్రమలను ఏర్పాటు చేయించారు. బాబు హయాంలో రూ.59,970 కోట్ల పెట్టుబడులు మాత్రమే వస్తే లక్షల కోట్ల రూపాయలు వచ్చేశాయని డబ్బా కొట్టారు.