సోషల్ మీడియాలో సంచలనంగా మారిన నారా చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరీ భూతుల ఆడియొ నిజమే అని తేలిపోయింది. తెలుగుదేశం వారు ప్రచారం చేస్తునట్టు అది డీఫ్ ఫేకో , మార్ఫో కాదని ఆమే మాట్లాడిన ఓరిజినల్ ఆడియోనే అని డిల్లీకి చెందిన మిస్ ఇంఫర్మేషన్ అలియన్స్ అనే సంస్థ పలు ఎనాలసిస్ల తరువాత తేల్చేసింది.
ఇంకా ఆ సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఆడియో డీప్ ఫేకో కాదో తేల్చవలసిందిగా ట్విట్టర్ ఖాతాల ద్వారా తమకి సందేశాలు వచ్చాయని వారి విజ్ఞప్తి మేరకు డాక్టర్ హనీ ఫరీద్ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా తాము ఆ ఆడియోలోని నిజనిజాలను తేల్చవలసిందిగా కోరగా వారు సదరు ఆడియోను విశ్లేషించడానికి ఆటోమేటెడ్ మరియు మాన్యువల్ పద్ధతులను ఉపయోగించి అది నిజమైన ఆడియోనే అని ధృవీకరించారని చెప్పుకొచ్చారు.
అలాగే ఆడియోలో ఉన్న ఉచ్చారణ మరియు కోపం వంటి బలమైన భావోద్వేగాలను డీప్ ఫేక్ లో చేయడం ఇప్పటివరకు తాము వినలేదని చెబుతూనే ఈ మాటలు ఆడియోలోని మనిషి ఎక్కడ ఉపయోగించారు ఏ సంధర్భంలో ఉపయోగించారు అనే అంశం తాము చెప్పలేమని తేల్చేశారు. డాక్టర్ హనీ ఫరీద్ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ తో పాటు మరో సంస్థ అయిన కాంట్రాలైస్ ఏఐ అమి ఫ్రం ఇండియా అనే సంస్థ కూడా ఆడియోను విశ్లేషించి, అది ఏఐ జెనరేటెడ్ ని ఉపయోగించి తయారు చేయలేదని నిర్ధారించిందని ఆడియో పూర్తిగా వాస్తవమైనదని ఎలాంటీ డీప్‌ఫేక్ కాదని నిర్ధారించారు.
ఈ సంస్థ చేసిన నిర్ధారణమేరకు వైరల్ అయిన ఆడియోలో ఉన్న పచ్చి బూతులు మాట్లాడింది చంద్రబాబు భార్య భువనేశ్వరీ మాటలే అని నిర్ధారణ అయింది. తెలుగుదేశం వారు చెప్పుకుంటూ వస్తున్న ఫేక్ మాటలు నిజాలు కాదని తేలిపోయింది. ఇప్పుడు ఈ సంస్థపై కూడా తెలుగుదేశం వారు ఏదొక ముద్ర వేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం తప్ప ఈ వ్యవహారంలో పూర్తిగా అబాసుపాలయ్యారనే వాదన బలంగా ఉంది. చూద్దం తెలుగుదేశం వారి రియాక్షన్ ఎలా ఉంటుందో .